BalaKrishna - ఈసారి కూడా 2 గెటప్స్

Monday,December 21,2020 - 08:00 by Z_CLU

ఒకే సినిమాలో 2 వేరియేషన్స్ లో కనిపించడం బాలయ్యకు చాలా ఇష్టం. ఎన్నో సినిమాల్లో బాలయ్య ఇలా కనిపించాడు. ఒక్కోసారి 3 గెటప్స్ లో కనిపించిన సినిమాలు కూడా ఉన్నాయి. ఇప్పుడు తన కొత్త సినిమాకు కూడా ఇదే ఫార్ములా ఫాలో అవుతున్నాడు నటసింహం.

బోయపాటి శ్రీను (Boyapati Srinu) దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు బాలకృష్ణ (Balakrishna). ఈ మూవీలో బాలయ్య 2 డిఫరెంట్ గెటప్స్ లో కనిపించబోతున్నాడు. వీటిలో ఒకటి అఘోర గెటప్ కాగా.. రెండోది ఐఏఎస్ ఆఫీసర్ గెటప్.

పవర్ ఫుల్ క్యారెక్టర్ ఇంటర్వెల్ బ్యాంగ్ లో రావడం కామన్. ఈ సినిమాలో కూడా అఘోరా పాత్ర ఇంటర్వెల్ బ్యాంగ్ టైమ్ లో వస్తుందని, సినిమాకు అదే పెద్ద ట్విస్ట్ అవుతుందని చెబుతోంది యూనిట్.

ప్రగ్యా జైశ్వాల్ (Pragya Jaiswal), పూర్ణ (Poorna) హీరోయిన్లుగా నటిస్తున్న ఈ సినిమాకు తమన్ సంగీతం అందిస్తున్నాడు. మిర్యాల రవీందర్ నిర్మాత. సినిమాను వచ్చే ఏడాది సమ్మర్ కు ప్లాన్ చేస్తున్నారు.

Also Check – ఆ దర్శకుడితో బాలయ్య మళ్లీ..