బాలయ్య 102 లేటెస్ట్ అప్ డేట్స్

Tuesday,September 12,2017 - 12:59 by Z_CLU

K.S. రవికుమార్ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న బాలయ్య 102 వ సినిమా ఫాస్ట్ పేజ్ లో షూటింగ్ జరుపుకుంటుంది. ఆగష్టు 3 నుండి 30 వరకు రామోజీ ఫిలిం సిటీలో వేసిన భారీ సెట్స్ లో షూటింగ్ జరుపుకున్న సినిమా యూనిట్, ఇప్పుడు కుంభకోణం లో హై ఎండ్ యాక్షన్ సీక్వెన్సెస్ తో పాటు సినిమాలోని కీలక సన్నివేశాలను తెరకెక్కించే పనిలో పడింది.

అల్టిమేట్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో బాలయ్య సరసన ముగ్గురు హీరోయిన్స్ నటిస్తుండగా ఇప్పటికే నయనతార, నటాషా దోషిని ఫిక్స్ చేసుకున్న సినిమా యూనిట్, మరో హీరోయిన్ ని ఫిక్స్ చేసుకునే ప్రాసెస్ లో ఉంది. చిరాంతన్ భట్ మ్యూజిక్ కంపోజ్ చేశాడు. CK ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై వరుణ్, తేజ సంయుక్తంగా ఈ సినిమాని నిర్మిస్తున్నారు.