బాలకృష్ణ 102 బిగిన్ అయింది

Thursday,August 03,2017 - 11:20 by Z_CLU

బాలయ్య పైసా వసూల్ షూటింగ్ కంప్లీట్ అయింది. సెప్టెంబర్ 1 న రిలీజ్ డేట్ ఫిక్స్ చేసుకున్న ఈ సినిమా ఆల్ రెడీ పోస్ట్ ప్రొడక్షన్ ప్రాసెస్ కూడా బిగిన్ చేసేసింది. అయితే ఈ సినిమా సెట్స్ పై ఉండగానే K.S. రవి కుమార్ సినిమాకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన బాలయ్య, ఈ సినిమాకి ప్యాకప్ చెప్పీ చెప్పగానే K.S. రవి కుమార్ తో షూట్ బిగిన్ చేశాడు.

ఈ సినిమా ఈ రోజు రామోజీ ఫిలిం సిటీ లో గ్రాండ్ గా లాంచ్ అయింది. ఈ అకేషన్ లో  డైరెక్టర్స్ బోయపాటి శ్రీను, క్రిష్ కూడా అటెండ్ అయ్యారు. ఈ రోజు నుండే రెగ్యులర్ షూటింగ్ బిగిన్ చేసిన సినిమా యూనిట్, ఈ షెడ్యూల్ లో భారీగా డిజైన్ చేసిన మార్కెట్ సెట్ లో సినిమాకి సంబంధించిన కీలక సన్నివేశాలను తెరకెక్కించనుంది.

ఈ సినిమాకి చిరాంతన్ భట్ మ్యూజిక్ కంపోజ్ చేస్తున్నాడు. అల్టిమేట్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కనున్న ఈ సినిమాలో బాలయ్య సరసన నయనతార నటించనుంది. C. కళ్యాణ్ ప్రొడ్యూసర్.