బాలకృష్ణ 101 షార్ట్ లిస్టెడ్ హీరోయిన్స్

Friday,March 10,2017 - 03:00 by Z_CLU

బాలయ్య పూరి జగన్నాథ్ సినిమా లాంచ్ అయింది. ఫాస్ట్ పేజ్ లో షూటింగ్ కంప్లీట్ చేసే పూరి, డిసిప్లిన్ అంటే డిసిప్లిన్ అనే  బాలయ్య… ఏముంది సినిమా రిలీజ్ డేట్ కూడా అనౌన్స్ చేసేశారు కాబట్టి హ్యాప్పీగా రిలీజ్ డేట్ కి కౌంట్ డౌన్ బిగిన్ చేసుకోవచ్చు. కానీ సినిమా లాంచ్ కి రిలీజ్ కి మధ్య తెలియాల్సిన మరో ఇంటరెస్టింగ్ ఎలిమెంట్ ఇంకా పెండింగ్ ఉంది. బాలయ్య సరసన స్పేస్ చేసుకోబోయే హీరోయిన్.. ఇంతకీ ఈసారి బాలయ్య తన హీరోయిన్ గా ఎవరిని ప్రిఫర్ చేసే చాన్సెస్ ఉన్నాయి. ఇదే ఇప్పుడు టాలీవుడ్ లో హాట్ టాపిక్.

 

GPS టైం లోనే కాజల్ డేట్స్ కోసం ట్రై చేసింది సినిమా యూనిట్. అప్పుడీ పంచదార బొమ్మ బిజీ బిజీగా ఉండటంతో ఆ ఆఫర్ చిన్నగా నయనతార వైపు, అక్కణ్ణించి శ్రియ వైపు మళ్ళింది. ఏది ఏమైనా ఆల్ రెడీ మైండ్ లో ఉన్న హీరోయిన్ కాబట్టి  ఈ సినిమాకి కూడా ప్రిఫర్ చేసే చాన్సెసే ఎక్కువగా ఉన్నాయి. అందునా కాజల్, పూరి బాగా క్లోజ్ కూడాను.. కాబట్టి ప్రాక్టికల్ గా డేట్స్ లాంటివి అడ్డొచ్చేస్తే చెప్పలేం కానీ, ఈ జోడి కానీ ఫిక్సయితే పూరి మార్క్ హీట్ జెనెరేట్ అయినట్టే.

 

 

గౌతమీపుత్ర శాతకర్ణీ లో పర్ ఫెక్ట్ క్వీన్ అనిపించుకుంది శ్రియ. ఇద్దరు పిల్లలకు తల్లిగా కనిపిస్తూనే, కావాల్సినంత గ్రేస్ తో సినిమాకి ఎసెట్ లా నిలిచింది. ఆ విషయం బాలయ్య కూడా చాలాసార్లు ప్రస్తావించాడు. లక్కీ స్క్రీన్ పార్ట్ నర్ కాబట్టి… ఏముంది నెక్స్ట్ సినిమా కూడా తనతోనే కానిచ్చేద్దాం అని బాలయ్య ఫీల్ అయితే, పూరి నో అనే చాన్స్ అయితే అస్సలుండవు. కాబట్టి ఈ జోడిని ఎక్స్ పెక్ట్ చేయడం మరీ ఓవర్ ఎక్స్ పెక్టేషన్స్ అయితే కాదు.

 

సింహ, శ్రీరామ రాజ్యంలో బాలయ్య కి సరైన సతి.. అదే పర్ ఫెక్ట్ హీరోయిన్ అనిపించుకుంది నయనతార. ఆ తరవాత ఈ కాంబో మళ్ళీ రిపీట్ చేద్దామని ఎంత ట్రై చేసినా కుదరలేదు. నయన్ అటు తమిళంలో లేడీ ఓరియంటెడ్ ప్రాజెక్ట్స్ తో బిజీబిజీ గా ఉండటం తో GPS  లోను చాన్స్ మిస్సయింది. మరి ఈసారేమైనా వర్కవుట్ అయ్యే చాన్సెస్ ఉంటే బాలయ్య ఫస్ట్ ప్రిఫరెన్స్ నయన్ కి ఇచ్చే చాన్సెస్ అయితే బోలెడున్నాయి.

 

ఆల్ రెడీ లయన్ సినిమాలో బాలయ్యతో జోడీ కట్టింది త్రిష. ప్రస్తుతం చేతినిండా సినిమాలతో బిజీ బీ లా తయారైన త్రిషకి బాలయ్య సరసన స్పేస్ దొరకాలి కానీ నో అనే చాన్సే ఉండదు. సినిమా యూనిట్ మైండ్ లో ఏం నడుస్తుందో ప్రస్తుతానికి సస్పెన్సే అయినా, ఈ అకౌంట్ లో త్రిష ఉండే చాన్సెస్ అయితే చాలా ఉన్నాయి.

బాలయ్య సినిమా అంటేనే రాయల్ రేంజ్. అలాంటిది ఆ సినిమాలో టాలీవుడ్ క్వీన్ అనుష్క తోడైతే సినిమా లెవెల్ ఇంకో అడుగు పెరిగినట్టే. కాబట్టి 100%  అని గ్యారంటీ అయితే ఇవ్వలేం కానీ, అనుష్క పేరు డిస్కషన్స్ కి రాకుండానే  బాలయ్య హీరోయిన్ ఫిక్స్ అయ్యే చాన్సెస్ ఆయితే అస్సలుండవు. మరి ఆ డిస్కషన్స్ లో అనుష్క ఫైనల్ అవుతుందో లేదో సినిమా యూనిట్ అనౌన్స్ చేస్తే కానీ మనకీ తెలీదు.