బాలయ్య 101 మూవీ ఫస్ట్ లుక్ అప్ డేట్స్

Tuesday,June 06,2017 - 03:41 by Z_CLU

స్టైలిష్ డాన్ గా కనిపించనున్న బాలయ్య 101 సినిమా ఫాస్ట్ పేజ్ లో షూటింగ్ కంప్లీట్ చేసుకునే పనిలో ఉంది. ప్రస్తుతం పోర్చుగల్ లో రిచెస్ట్ లొకేషన్స్ లో షూటింగ్ జరుపుకుంటున్న సినిమా యూనిట్ జూన్ 13 కల్లా ఈ షెడ్యూల్ కి ప్యాకప్ చెప్పే ఆలోచనలో ఉంది.

ఈ లోపు జూన్ 9 న బాలయ్య పుట్టిన రోజు సందర్భంగా, సినిమా యూనిట్ ఫస్ట్ లుక్ ని రిలీజ్ చేసే ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తుంది. భవ్య క్రియేషన్స్ బ్యానర్ పై తెరకెక్కుతున్న ఈ సినిమాలో శ్రియా శరణ్ తో పాటు ముస్కాన్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు.