రన్ టైమ్ లాకయింది

Monday,April 10,2017 - 04:10 by Z_CLU

బాహుబలి 2 రన్ టైమ్ లాకయింది. లాస్ట్ 2 ఇయర్స్ గా ఎప్పుడెప్పుడు చూస్తామా అనే ఆతృతని క్రియేట్ చేసిన బాహుబలి – ది కంక్లూజన్ ఫస్ట్ పార్ట్ ని మించిన ఎగ్జైటెడ్ ఎలిమెంట్స్ తో ఎంటర్ టైన్ చేయడానికి రెడీ అయిపోయింది. మ్యాగ్జిమం పోస్ట్ ప్రొడక్షన్ కి ఇప్పటికే ప్యాకప్ చెప్పేసిన సినిమా యూనిట్ ఈ సినిమా రన్ టైమ్ ని 02 : 50 మినట్స్ కి లాక్ చేసింది.

హై ఎండ్ ఇమోషన్స్, వార్ సీక్వెన్సెస్ తో విజువల్ వండర్ లా తయారైన బాహుబలి 2 సినిమా యూనిట్, సెన్సార్ క్లియరెన్స్ కోసం వెయిట్ చేస్తుంది. నిన్న సాయంత్రం తమిళంలోను ఆడియో రిలీజ్ జరుపుకున్న సినిమా యూనిట్, ఎక్కడ అడుగు పెడితే అక్కడ పాజిటివ్ రెస్పాన్స్ ని బ్యాగ్ లో వేసుకుంటుంది. తెలుగు, తమిళ, మళయాళ, హిందీ భాషల్లో ఏప్రిల్ 28 న రిలీజ్ కానున్న బాహుబలి 2 ఒక్క ఇండియాలోనే 6000 థియేటర్స్ లో రిలీజవుతుంది.