మార్కెట్లో మొనగాడు

Tuesday,October 04,2016 - 04:29 by Z_CLU

సినిమా ఇండస్ట్రీలో ఏ రికార్డు శాశ్వతం కాదు. కానీ బాహుబలి దూకుడు చూస్తుంటే కలెక్షన్ ల పరంగా రికార్డులు కాదు. ఏకంగా కంచుకోట కట్టుకుంటుందా అనిపిస్తుంది. బాహుబలి 600 కోట్లు వసూలు చేసి రికార్డు సృష్టిస్తే బాహుబలి-ది కంక్లూజన్ ఏకంగా 1000 కోట్ల టార్గెట్ వైపు పరుగు పెడుతుందనిపిస్తుంది.

వివిధ భాషల్లో ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ అయిన బాహుబలి అంచనాలకు మించి ఏకంగా 600 కోట్లు వసూలు చేసింది. అందుకే బాహుబలి 2 కనీసం షూటింగ్ కూడా పూర్తి కాకముందే ప్రీ రిలీజ్ బిజినెస్ మొదలైపోయింది. పోకిరి, కిక్, రన్ రాజా రన్, టెంపర్, బాద్ షా లాంటి సూపర్ హిట్ సినిమాలను USA లో రిలీజ్ చేసిన ‘గ్రేట్ ఇండియా మూవీస్’ సంస్థ ఏకంగా 45 కోట్లు వెచ్చించి తెలుగు. తమిళ, హిందీ మరియు మళయాళ భాషల్లో హక్కులు సొంతం చేసుకుంది.

baahubaliprabhas

       భారతీయ సినిమాలకు USA, ఆస్ట్రేలియా, లండన్, దుబాయి మార్కెట్ లలో మంచి డిమాండ్ ఉంది. ఇకపోతే ఒక USA లోనే బాహుబలి ఇంతలా వసూలు చేస్తే ఇంకా ప్రపంచ వ్యాప్తంగా ఇంకెన్ని  రికార్డులు బ్రేక్ చేయనుందో. ఇంతటి ప్రతిష్టాత్మకంగా సినిమాని తెరకెక్కిస్తున్న రాజమౌళి కూడా, ఈ రికార్డుల కంచు కోటను ఢీ కొట్టలేడనిపిస్తుంది.