సెన్సార్ తరవాతే ప్రమోషన్స్

Monday,April 10,2017 - 12:13 by Z_CLU

బాహుబలి టీమ్ రెడీ ఫర్ ప్రమోషన్స్ మోడ్ లో ఉంది. మ్యాగ్జిమం పోస్ట్ ప్రొడక్షన్ కి ప్యాకప్ చెప్పేసిన సినిమా యూనిట్, సెన్సార్ క్లియరెన్స్ కోసం వెయిట్ చేస్తుంది. ఒక్కసారి సెన్సార్ నుండి గ్రీన్ సిగ్నల్ వచ్చీ రాగానే మ్యాగ్జిమం అన్ని లాంగ్వేజెస్ తో పాటు, US లోను భారీ ప్రమోషన్స్ చేసే ఏర్పాట్లలో ఉన్నారు ఫిలిం మేకర్స్.

బాహుబలి తోనే బాహుబలి 2 కి కూడా మార్కెట్ ని క్రియేట్ చేసుకున్న సినిమా యూనిట్, ఆల్ రెడీ ఫ్యాన్స్ లో క్రియేట్ అయిన క్యూరాసిటీ  డోస్ ని మరింత పెంచేందుకు అప్పుడే స్కెచ్ వేయడం కూడా బిగిన్ చేసేసింది బాహుబలి బిజినెస్ టీమ్. రీసెంట్ గా జరిగిన ప్రీ రిలీజ్ ఫంక్షన్ లో మ్యాగ్జిమం ఫ్యాన్స్ అటెన్షన్ ని బ్యాగ్ లో వేసుకున్న బాహుబలి ఫిలిం మేకర్స్, ఏప్రిల్ 28 న రిలీజ్ కానున్న ఈ సినిమాతో మరిన్ని రికార్డ్స్ బ్రేక్ చేసే ప్రాసెస్ లో ఉంది.

బాహుబలిని కట్టప్ప ఎందుకు చంపాడు అన్నది సినిమాలో కీలక అంశమైతే అటువంటి ఇంటరెస్టింగ్ ఎలిమెంట్స్ సినిమాలో బోలెడు ఉండబోతున్నాయని ఇది వరకే అనౌన్స్ చేసిన రాజమౌళి, ప్రమోషన్స్ ప్రాసెస్ లో ఇంకా ఏయే ఇంటరెస్టింగ్ టాపిక్స్ ని రేజ్ చేయబోతున్నాడో అన్న క్యూరాసిటీ ఆల్ రెడీ ఫ్యాన్స్ లో రేజ్ అయిపోయింది.