బాహుబలి వాలెంటైన్స్ డే స్పెషల్ గిఫ్ట్

Monday,February 13,2017 - 07:02 by Z_CLU

మరికొన్ని గంటల్లో వాలంటైన్స్ డే వచ్చేస్తోంది. ప్రేమికులంతా ఆ ఘడియల కోసం ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. తమ ప్రేయసి లేదా ప్రియుడికి అదిరిపోయే గిఫ్ట్ తో పాటు గ్రీటింగ్ కార్డ్ ఇచ్చి లవ్ ను ఎక్స్ ప్రెస్ చేయాలని వెయిట్ చేస్తున్నారు. ఇలాంటి లవర్స్ ను టార్గెట్ చేసింది బాహుబలి. రొటీన్ గా పువ్వులు, లవ్ సింబల్స్ తో ఉన్న గ్రీటింగ్ కార్డ్స్ ఇచ్చి బోర్ కొట్టిందా… అయితే వెరైటీగా బాహుబలి గ్రీటింగ్ ఇవ్వండి అంటోంది సినిమా యూనిట్. బాహుబలిలో ప్రభాస్, అనుష్కను ఎంతగా ప్రేమిస్తాడో.. అంతకంటే ఎక్కువగా ప్రేమిస్తున్నామని తమ గ్రీటింగ్స్ ద్వారా చెప్పండి అంటూ ఊరిస్తోంది. ఆ గ్రీటింగ్స్ ఎలా తయారుచేయాలి… ఎలా డౌన్ లోడ్ చేసుకోవాలి… ఎలా ప్రజెంట్ చేయాలో తెలుపుతూ ఓ డెమో వీడియోను కూడా పోస్ట్ చేసింది. కావాలంటే మీరూ ట్రై చేయండి….