బాహుబలి 2 ట్రేలర్ లాంచ్

Thursday,January 19,2017 - 05:01 by Z_CLU

టాలీవుడ్ లో ఫిబ్రవరి నుండి మరోసారి బాహుబాలి మానియా స్ప్రెడ్ కానుంది. ఏప్రిల్ 28 న రిలీజ్ కానున్న బాహుబలి కంక్లూజర్ ట్రేలర్ ని ఫిబ్రవరిలో రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తుంది సినిమా యూనిట్. అయితే ఈ ట్రేలర్ ని జస్ట్ సింపుల్ గా రిలీజ్ చేయడం లేదు.

ఆడియో రిలీజ్ లాంటి టాపిక్ అయితే ప్రస్తుతానికి బయటికి రాలేదు కానీ, ఈ ట్రేలర్ లాంచ్ ని చాలా గ్రాండ్ గా ప్లాన్ చేస్తున్నారు నిర్మాతలు. ఈ ఈవెంట్ కి సంబంధించి ఎగ్జాక్ట్ డేట్ అయితే అనౌన్స్ కాలేదు కానీ, మ్యాగ్జిమం ఫిబ్రవరి ఫస్టాఫ్ లోనే ఈ ఈవెంట్ ని కండక్ట్ చేసే చాన్సెస్ ఉన్నాయని సమాచారం.

ఓ వైపు సినిమాకు కావాల్సిన గ్రాఫిక్ వర్క్ పై ఫోకస్ చేస్తూనే, మరో వైపు ఈ ట్రేలర్ మేకింగ్ పనుల్లో బిజీగా ఉంది సినిమా యూనిట్. బాహుబలి – The beginning కన్నా నెక్స్ట్ లెవెల్ విజువల్ వండర్ గా తెరకెక్కిన ఈ సినిమా కోసం ప్రపంచం మొత్తం ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తుంది.