బాహుబలి-2 క్యాలెండర్

Saturday,October 01,2016 - 11:41 by Z_CLU

బాహుబలి-2…. తెలుగులోనే కాదు… మొత్తం ఇండియాలోనే మోస్ట్ ఎవెయిటింగ్ ప్రాజెక్టు. ఈ సినిమా కోసం అభిమానులు కళ్లు కాయలు కాచేలా ఎదురుచూస్తున్నారు. మరీ ముఖ్యంగా బాహుబలిని కట్టప్ప ఎందుకు చంపాడనే ప్రశ్నకు సమాధానం తెలుసుకునేందుకు చాలా ఈగర్ గా ఉన్నారు. ఈ ప్రశ్నలకు సమాధానాలు దొరికే తేదీలు కన్ ఫర్మ్ అయ్యాయి. ఇప్పటివరకు మీడియా ముందుకురానీ బాహుబలి టీం… తొలిసారిగా ప్రెస్ మీట్ పెట్టింది. ప్రభాస్-రానాతో పాటు దర్శకుడు రాజమౌళి.. నిర్మాతలు ఈ ప్రెస్ మీట్ లో పాల్గొన్నారు. బాహుబలి-2 షెడ్యూల్స్ ప్రకటించారు.

bahubali-press-meet

క్యాలెండర్ ప్రకారం నిన్ననే బాహుబలి టైటిల్ లోగో విడుదల చేశారు. ఈరోజు యానిమేషన్ ట్రయిలర్ ను విడుదల చేశారు. ప్రభాస్ పుట్టినరోజుకు ఒక రోజు ముందు (అక్టోబర్ 22న) బాహుబలి-2 ఫస్ట్ లుక్ ను విడుదల చేయబోతున్నారు. ఫస్ట్ లుక్ తో పాటు వర్చువల్ రియాలిటీ ప్రోమోతో పాటు… సినిమా మేకింగ్ ను కూడా విడుదల చేయబోతున్నారు. ఆ తర్వాత అమెజాన్ సహకారంతో బాహుబలి కామిక్ బుక్స్ ను, ఇతర పబ్లిసిటీ వస్తువుల్ని (మార్కండైజ్) విడుదల చేస్తారు. జనవరిలో బాహుబలి థియేట్రికల్ ట్రయిలర్ ను విడుదల చేస్తారు. ఆ తర్వాత దశలవారీగా క్యారెక్టర్స్ కు సంబంధించిన లుక్స్ ను విడుదల చేస్తారు. ఫైనల్ గా ఏప్రిల్ 28న బాహుబలి-2 సినిమాను ప్రపంచవ్యాప్తంగా ఒకేసారి విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారు.