ఇంటర్నెట్ లో బాహుబలి-2 సినిమా

Tuesday,November 22,2016 - 11:13 by Z_CLU

బాహుబలి యూనిట్ కు మాత్రమే కాదు… టోటల్ ఇండస్ట్రీకే షాకింగ్ ఇది. భారీ బడ్జెట్ చిత్రంగా, భారీ అంచనాల మధ్య తెరకెక్కుతున్న బాహుబలి-2 సినిమా లీక్ అయింది. ఈ సినిమాకు సంబంధించిన కొన్ని సీన్లను ఎవరో ఇంటర్నెట్ లో పోస్ట్ చేశారు. వాటిలో కొన్ని యుద్ధ సన్నివేశాలు, మరికొన్ని డైలాగ్స్ ఉన్నాయి. వెంటనే తేరుకున్న బాహుబలి టెక్నికల్ టీం.. సోషల్ మీడియాలో ఉన్న పార్ట్-2 క్లిప్పింగ్స్ అన్నింటినీ బ్లాక్ చేసి పడేసింది. లీక్ చేసిన వ్యక్తి కోసం గాలిస్తోంది.

baahubali-2-movie-first-look-public-review

బాహుబలి సినిమాకు లీకేజీ కొత్త కాదు. గతంలో పార్ట్-1కు సంబంధించి కీలకమైన యుద్ధ సన్నివేశం క్లిప్పింగ్ ఒకటి నెట్ లో ప్రత్యక్షమైంది. ఇప్పుడు తాజాగా పార్ట్-2కు సంబంధించిన కొన్ని వీడియోలు కూడా ఇంటర్నెట్ లో ప్రత్యక్షం కావడంతో యూనిట్ కు టెన్షన్ పట్టుకుంది. నిజానికి లీక్ జరగకుండా ఉండేందుకు రాజమౌళి చాలా జాగ్రత్తలు తీసుకున్నాడు. కానీ కొన్ని క్లిప్స్ లీక్ అవ్వడం యూనిట్ కు పెద్ద తలనొప్పిగా మారింది.