ప్రపంచవ్యాప్తంగా 9వేల థియేటర్లలో బాహుబలి-2 రిలీజ్

Tuesday,April 25,2017 - 04:37 by Z_CLU

ఇంకా జస్ట్ 3 రోజుల్లో రిలీజ్ కానుంది బాహుబలి 2. ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న బిగ్గెస్ట్ మ్యాగ్నం ఓపస్ కోసం ఇప్పటికే టికెట్స్ ప్రీ బుకింగ్ చేసుకుని మరీ వెల్కమ్ చెప్తున్నారు బాహుబలి ఫ్యాన్స్. సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా బాహుబలి మానియా రూల్ చేస్తుంది. అందుకే బాహుబలి మేకర్స్ కూడా రిలీజ్ ని అంతే వైడ్ గా ప్లాన్ చేస్తున్నారు.

కేవలం ఇండియాలోనే 6,500 ల థియేటర్స్ లలో బాహుబలి రిలీజ్ అవుతుంది. ఇక USA లో 1,500 ల థియేటర్స్ లలో ఇవి కాక ఇతరత్రా దేశాల్లో కలిపి 1400 థియేటర్స్ లలో రిలీజ్ కానుంది బాహుబలి 2. అంటే ప్రపంచ వ్యాప్తంగా 9000 ల థియేటర్స్ లలో రిలీజ్ కానుంది బాహుబలి – ది కంక్లూజన్. మరో రెండు మూడు రోజుల్లో మరిన్ని  థియేటర్స్ ని పెంచే ఆలోచనలో ఉంది బాహుబలి బిజినెస్ టీమ్.