వాయిదా పడిన 'బాహుబలి-2'

Friday,August 05,2016 - 01:56 by Z_CLU

వచ్చే ఏడాది సమ్మర్ ఎట్రాక్షన్ గా బాహుబలి పార్ట్-2ను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ప్రస్తుతం రామోజీ ఫిలింసిటీలో షూటింగ్ ను శరవేగంగా జరుపుతున్నారు. 2017, ఏప్రిల్ 14న ఈ సినిమాను విడుదల చేయబోతున్నట్టు గతంలోనే ప్రకటించారు. అయితే తాజాగా ఈ సినిమా విడుదల తేదీని పోస్ట్ పోన్ చేశారు. ఏప్రిల్ 14న కాకుండా… ఏప్రిల్ 28న బాహుబలి-2ను విడుదల చేయబోతున్నారు. ఈ విషయాన్ని బాలీవుడ్ దర్శక-నిర్మాత కరణ్ జోహార్ ప్రకటించాడు. బాహుబలి ఫస్ట్ పార్ట్ హిందీ రైట్స్ ను కరణ్ జోహార్ తీసుకున్నాడు. బాలీవుడ్ లో ఆ సినిమాకు ప్రమోషన్ కల్పించడంలో కరణ్ కీలక పాత్ర పోషించాడు. అలా పార్ట్-1 హిందీలో మంచి వసూళ్లు సాధించింది. ఇప్పుడు బాహుబలి-ది కన్ క్లూజన్ సినిమా హక్కుల్ని కూడా కరణ్ దక్కించుకున్నాడు. తనకు చెందిన ధర్మ ప్రొడక్షన్, ఏఏ కార్పొరేషన్ సంస్థలు బాహుబలి-2 హిందీ రైట్స్ దక్కించుకున్నట్టు కరణ్ ప్రకటించాడు. అదే సందర్భంలో సినిమా విడుదల తేదీని కూడా ఏప్రిల్ 28కి పోస్ట్ పోన్ చేసినట్టు ప్రకటించాడు.