ఓవర్ సీస్ లో బాహుబలి మలయాళంలో రిలీజ్

Friday,May 12,2017 - 04:07 by Z_CLU

బాహుబలి 2 మలయాళం లోను రిలీజయింది. ఇండియాలో తెలుగు, తమిళ, హిందీ, మళయాళ భాషల్లో రిలీజైనా  ఓవర్సీస్ లో మలయాళం ఇవాళ్టికి గాని రిలీజ్ కాలేదు. ఇప్పటికే అటు లోకల్, ఓవర్ సీస్ అని తేడా లేకుండా  రిలీజైన ప్రతి సెంటర్ లో రికార్డ్స్ బ్రేక్ చేసే పనిలో ఉన్న బాహుబలి 2, ఈ రిలీజ్ తో మరిన్ని కలెక్షన్స్ ని బ్యాగ్ లో వేసుకోవడానికి రెడీ అయిపోయింది.

అమెరికా, బ్రిటన్, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా లో ఈ రోజు మలయాళంలో రిలీజైన బాహుబలి అదే క్రేజ్ తో దూసుకుపోతుంది. ఇప్పటికే 1200 కోట్లకు మించిన కలెక్షన్స్ తో దూసుకుపోతున్న బాహుబలి 2, ఇంకా ఎన్ని రికార్డులు బ్రేక్ చేయనుందో చూడాలి.