రేపు రాత్రి నుంచే బాహుబలి-2 హంగామా

Wednesday,April 26,2017 - 07:25 by Z_CLU

ప్రేక్షకులంతా ఉత్కంఠగా ఎదురుచూస్తున్న బాహుబలి-2 సినిమా శుక్రవారం నుంచి థియేటర్లలో హల్ చల్ చేయబోతోంది. అయితే లేటెస్ట్ అప్ డేట్ ఏంటంటే.. ఈ సినిమా హంగామా రేపట్నుంచే హైదరాబాద్ లో షురూ కానుంది. అవును.. హైదరాబాద్ లోని అన్ని మల్టీప్లెక్సుల్లో గురువారం రాత్రి నుంచే బాహుబలి-2 సందడి స్టార్ట్ అవుతోంది. మల్టీప్లెక్సులతో పాటు నగరంలోకి కొన్ని ప్రముఖ థియేటర్లలో కూడా రేపు సెకెండ్ షో నుంచి బాహుబలి-2 సినిమాను ప్రదర్శించనున్నారు.

అయితే రెగ్యులర్ షోస్ తో పోలిస్తే, రేపు రాత్రి వేసే ప్రీమియర్ షో టిక్కెట్ ధరలు చుక్కల్ని తాకనున్నాయి. కానీ సినిమాపై ఉన్న భారీ అంచనాలు ఉండడం, మరోవైపు వీకెండ్ వరకు టిక్కెట్లు అయిపోవడంతో.. ప్రీమియర్ టిక్కెట్లు కూడా హాట్ కేకుల్లా అమ్ముడుపోయాయి.

బాహుబలి-2 సినిమా ప్రపంచవ్యాప్తంగా 9వేల స్క్రీన్స్ లో విడుదలకానుంది. ఒక్క అమెరికాలోనే అన్ని వెర్షన్స్ కలిపి దాదాపు 1150 స్క్రీన్స్ బాహుబలి-2కు కేటాయించారు. ఓ సౌత్ సినిమాకు అమెరికా-కెనడా దేశాల్లో ఇన్ని స్క్రీన్స్ దక్కడం రికార్డు. ఇండియాలో దాదాపు 6వేల స్క్రీన్స్ పై బాహుబలి-2 రిలీజ్ అవుతోంది. ఇక తెలుగు రాష్ట్రాల విషయానికొస్తే, ఆంధ్రప్రదేశ్ లో ఈ సినిమాను రోజుకు 6 షోలు, తెలంగాణలో రోజుకు 5 షోలు వేసుకునేందుకు రెండు రాష్ట్రాల ప్రభుత్వాలు అనుమతినిచ్చాయి.