బాహుబలి 2 హైలెట్స్

Thursday,April 27,2017 - 12:58 by Z_CLU

వరల్డ్ వైడ్ గా కంపల్సరీగా చూడాల్సిందే అనే డిమాండ్ ని క్రియేట్ చేసింది బాహుబలి 2. ప్రపంచ వ్యాప్తంగా 9 వేల థియేటర్ లలో రిలీజవుతున్న బాహుబలి 2 లో మేజర్ హైలెట్స్ ఇవే.

 

అంతర్యుద్ధం : బాహుబలికి భళ్ళాలదేవకి మధ్య జరిగే అంతర్యుద్ధం సినిమాకి డెఫ్ఫినేట్ గా మేజర్ హైలెటే. ఈ అంతర్యుద్ధానికి కారణాలు ఏవైనా, యాక్షన్ విషయంలో ఏ మాత్రం కాంప్రమైజ్ కాని రాజమౌళి, ఈ యుద్ధాన్ని బాహుబలి – ది బిగినింగ్ లో కాళకేయునితో జరిగిన యుద్ధం కన్నా నెక్స్ట్ లెవెల్ లో ప్లాన్ చేసి ఉంటాడు ఇది మాత్రం పక్కా కన్ఫం.

విజువలైజేషన్ : హై ఎండ్ టెక్నికల్ వ్యాల్యూస్ తో తెరకెక్కిన బాహుబలి 2 లోని ప్రతి సీన్ అద్భుతమే. మేకింగ్ విషయంలో ఏ చిన్న డీటేల్ ని కూడా అంత ఈజీగా డ్రాప్ చేయని రాజమౌళి, ఏ మాత్రం కాంప్రమైజ్ కాకుండా తెరకెక్కించిన విజువల్ వండర్ బాహుబలి. ఈ సినిమా చూస్తున్నామంటే మాహిష్మతి రాజ్యంలో ఎంటర్ అయినట్టే.

కామెడీ : బాహుబలి లో కామెడీనా..? కాస్త ఉలిక్కిపడాల్సిన విషయమే అయినా, ఏ ఎలిమెంట్ ని అంత ఈజీగా లైట్ తీసుకోని రాజమౌళి ఈ సినిమాలో కామెడీ కి అంతే ఇంపార్టెన్స్ ఇచ్చినట్టు తెలుస్తుంది. సిచ్యువేషనల్ గా ఎలివేట్ అయ్యే కామెడీ, సినిమాకి ఆడెడ్ బోనస్ లాంటిదే.

అమరేంద్ర బాహుబలి : బాహుబలి ది బిగినింగ్ లో నిజం చెప్పాలంటే అసలు అమరేంద్ర బాహుబలి క్యారెక్టరైజేషన్ అసలు హైలెటే కాలేదు. మహా అయితే యుద్ధంలో శత్రువుతో ఎలా తలపడ్డాడు, తన అనుకున్న వారిని ఎలా కాపాడుకుంటాడు లాంటివి తప్ప, ఎక్కడా తన ఎగ్జాక్ట్ మ్యానరిజం వెలికి రాలేదు. బాహుబలి 2 లో హైలెట్ గా నిలిచే పాయింట్స్ లో ఇది కూడా ఒకటి.

సాంగ్స్ : బాహుబలి సినిమాకి బేస్ గా నిలిచే ఇంపార్టెంట్ ఎలిమెంట్స్ లో సాంగ్స్ మేజర్ హైలెట్. ఇప్పటికే రిలీజైన ఆడియో సూపర్ హిట్ కి నెక్స్ట్ లెవెల్ ని రీచ్ అయింది. ఇక మిగిలింది ఆ అద్భుతాన్ని స్క్రీన్ పై చూడటమే. అందునా ప్రభాస్, అనుష్క కెమిస్ట్రీ పై ఇప్పటికే హై ఎండ్ ఎక్స్ పెక్టేషన్స్ క్రియేట్ అయి ఉన్నాయి.

పీక్ ఎలిమెంట్ : మహేంద్ర బాహుబలి దేవసేనను తీసుకుని వెళ్లిపోవడమే బిగినింగ్ కి క్లైమాక్స్. కానీ బాహుబలి లేడు, ఇక తనకు తిరుగులేదు అని అటు దేవసేనని, ప్రజల్ని హింసిస్తూ రాజ్యమేలుతున్న భళ్ళాలదేవ, మహేంద్ర బాహుబలిని ఫేస్ చేసే ఎలిమెంట్… డెఫ్ఫినేట్ గా జస్ట్ మాహిష్మతినే కాదు, థియేటర్స్ ని కూడా షేక్ చేసి వదిలి పెడుతుంది. ఇది మాత్రం గ్యారంటీ.

క్లైమాక్స్ యుద్ధం : ఈ హై ఎండ్ ఇమోషనల్, యాక్షన్ ఎంటర్ టైనర్ ని కంప్లీట్ గా డామినేట్ చేయగలిగే మరో ఎలిమెంట్ క్లైమాక్స్ లో వచ్చే వార్. బాహుబలి, కట్టప్ప, అవంతిక, తక్కిన సైన్యం ఓ వైపు, మహాబలుడు భళ్ళాలుడు, బిజ్జాలుడి పన్నాగాలు, తన సైన్యం ఓ వైపు… హై ఎండ్ వైబ్రేషన్స్ మధ్య, బాహుబలి, భళ్ళాల దేవని ఓడించి తిరిగి తన రాజ్యాన్ని, ప్రజల్ని గెలుచుకునే అద్భుతమైన ఎలిమెంట్. ఫిలిం మేకర్స్ అనౌన్స్ చేసినట్టు 2:45 నిమిషాల్లో సినిమా కంప్లీట్ అయినా ఈ క్లైమాక్స్ వార్ క్రియేట్ చేసే మ్యాజిక్ నుండి బయటపడటానికి కొన్ని రోజులైనా కంపల్సరీగా పడుతుంది.