క్లైమాక్స్ కి భారీగా ఖర్చు పెట్టనున్నారట !

Tuesday,July 19,2016 - 11:34 by Z_CLU

 

రాజమౌళి తెరకెక్కించిన బాహుబలి పార్ట్ 1 ఎంతటి విజయాన్ని సాధించిందో? అందరికీ తెలిసిందే. ఇండియన్ సినిమా స్థాయిని ప్రపంచానికి తెలియజేసిన చిత్రం బాహుబలి. అయితే ఇప్పుడు మరో సారి కలెక్షన్స్ తో పాటు మరో సరి కొత్త రికార్డు నెలకొల్పడానికి ”బాహుబలి’ పార్ట్ తో సిద్దమవుతున్నాడు జక్కన్న. ఇక తొలి భాగం ఘన విజయం సాధించడం తో పాటు వసూళ్ల సునామి సృష్టించడం ఇప్పుడు పార్ట్ 2 కి బాగా కలిసొచ్చింది. ‘బాహుబలి’ ది బిగినింగ్ కన్నా మరింత జాగ్రత్త వహిస్తూ ఖర్చుకు ఏమాత్రం వెనకడుగు వేయ కుండా ఇప్పుడు ‘బాహుబలి- ది ఎండింగ్’ ను నిర్మిస్తున్నారట నిర్మాతలు. ఇక పార్ట్ 1 లో క్లైమాక్స్ అందరినీ ఆకట్టుకొని సినిమాకు ఆయు పట్టు గా నిలవడం తో ఇప్పుడు పార్ట్ 2 లో కూడా అదే రేంజ్ లో భారీ బడ్జెట్ తో క్లైమాక్స్ ఫైట్ ను చిత్రీకరించనున్నారట యూనిట్. ఈ క్లైమాక్స్ ఫైట్ కోసమే దాదాపు 30 కోట్లు ఖర్చు పెట్టనున్నారని సమాచారం. ఈ వార్త విని కేవలం క్లైమాక్స్ కె ఇంత ఖర్చా? అంటూ షాక్ అవుతున్నారు సినీ జనం. ఇంకో రెండు నెలల్లో చిత్రీకరణ పూర్తి అవ్వనున్న ఈ చిత్రం వచ్చే ఏడాది ఏప్రిల్ లో విడుదల కానుంది.