పీకే రికార్డ్స్ బ్రేక్ చేసిన బాహుబలి 2

Thursday,May 04,2017 - 02:53 by Z_CLU

బాహుబలి రికార్డ్ బ్రేకింగ్ అకౌంట్ లో మరో రికార్డ్ చేరిపోయింది. అన్ని రికార్డుల సంగతేమో కానీ, పీకే రికార్డ్ ని బ్రేక్ చేయడం కాస్త కష్టమే అని సెకండ్ ఒపీనియన్ వినిపించిన ట్రేడ్ వర్గాలను సైతం ఆశ్చర్యానికి గురి చేస్తూ, పీకే రికార్డును జస్ట్ ఆరు రోజుల్లో అవలీలగా బ్రేక్ చేసేసింది బాహుబలి 2.

వరల్డ్ వైడ్ గా ‘పీకే’ కలెక్ట్ చేసిన ఓవరాల్ గ్రాస్ 745 కోట్లు. ఈ రికార్డుని బ్రేక్ చేస్తూ రిలీజైన ఆరు రోజుల్లోనే 770 కోట్ల గ్రాస్ వసూలు చేసి ఇంకా బాక్సాఫీస్ దగ్గర అదే రేంజ్ లో స్పీడ్ లో ఉంది బాహుబలి 2.

బాహుబలి సినిమా లాంచ్ చేసినప్పుడే తలుగ్ సినిమా గర్వించే రేంజ్ లో సినిమా ఉండబోతుందనేది ఎక్స్ పెక్ట్ చేసిందే కానీ, ఇప్పటి వరకు అత్యధిక వసూలు చేసిన ఇండియన్ సినిమాలలో తెలుగు సినిమా పేరిట రికార్డ్ అయింది బాహుబలి 2. రిలీజై ఇన్ని రోజులు గడుస్తున్నా సినిమా పట్ల ఫ్యాన్స్ తగ్గని క్రేజ్ చూస్తుంటే బాహుబలి 2,  1000 కోట్లు వసూలు చేయడం మరీ అంత కష్టమేం కాదనిపిస్తుంది.