భారీగా ప్లాన్ చేస్తున్న ప్రొడక్షన్ హౌజ్

Wednesday,August 05,2020 - 03:11 by Z_CLU

టాలీవుడ్ లో వరుసగా సినిమాలు ప్లాన్ చేస్తోంది శ్రీ వెంకటేశ్వర సినిమాస్ LLP సంస్థ. మొదటి సినిమా విడుదల కాకుండానే ఏకంగా 4 సినిమాలు ప్రకటించింది. ఇటివలే నాగార్జున హీరోగా ప్రవీణ్ సత్తారు డైరెక్షన్ లో సినిమా అనౌన్స్ చేసిన నిర్మాతలు నారాయణ్ దాస్ కే నారంగ్, పుస్కూర్ రామ్మోహన్ రావు… నాగశౌర్య 20వ సినిమాను నిర్మించనున్నట్లుప్రకటించారు. తాజాగా నిఖిల్ హీరోగా మరో సినిమా అనౌన్స్ చేసిన మేకర్స్ శర్వానంద్ తో ఇంకో సినిమా ప్రకటించారు.

నాగ చైతన్య, సాయి పల్లవి జంటగా శేఖర్ కమ్ముల తీస్తున్న ‘లవ్ స్టోరి’ సినిమాతో లాంచ్ అవుతున్న ఈ బ్యానర్ నుండి మొదటి సినిమా విడుదల కాకముందే ఇలా మరో నాలుగు సినిమాలు వరుసగా అనౌన్స్ అవ్వడంతో బ్యానర్ హాట్ టాపిక్ అవుతుంది.

వీటిలో రెండు సినిమాలను నార్త్ స్టార్ శరత్ మరార్ తో కలిసి నిర్మించనుంది ఈ సంస్థ. ఈ సినిమాలతో ఈ బ్యానర్ ఎలాంటి హిట్స్ అందుకుంటుందో చూడాలి.