సితార లో మరో డైరెక్టర్ ఫిక్స్

Sunday,June 28,2020 - 01:36 by Z_CLU

ఎటువంటి బ్రేక్ లేకుండా వరుసగా సినిమాలు నిర్మించే సంస్థల్లో సితార ఎంటర్టైన్ మెంట్స్ ఒకటి. ఇప్పుడీ సంస్థ ఏకంగా ఓ ఐదారుగురు దర్శకులకు అడ్వాన్సులు అందించి సినిమాలు ప్లాన్ చేస్తోంది. ఇటివలే ఈ బ్యానర్ లో వచ్చిన ‘భీష్మ’ సూపర్ డూపర్ హిట్ గా నిలిచింది. ప్రస్తుతం సితార సంస్థ నితిన్ , వెంకీ అట్లూరి కాంబినేషన్ లో ‘రంగ్ దే’ నిర్మిస్తున్న సంగతి తెలిసిందే.

త్వరలోనే మరో మూడు ప్రాజెక్ట్స్ ను స్టార్ట్ చేసే ఆలోచనలో ఉన్నాడు సితార సంస్థ అధినేత నాగవంశీ. రాహుల్ సంక్రిత్యన్ డైరెక్షన్ లో ‘శ్యామ్ సింగ రాయ్’ త్వరలోనే స్టార్ట్ అవ్వబోతోంది. తాజాగా సాగర్ చంద్రకి ‘అయ్యప్పనుమ్ కోశియం’ రీమేక్ కి సంబంధించి అడ్వాన్సు అందించారు. ఇప్పుడీ లిస్టులో మరో దర్శకుడు కూడా చేరాడు.

రామ్ తో ‘రెడ్’ సినిమా తీస్తున్న కిషోర్ తిరుమలకి కూడా నెక్స్ట్ సినిమా కోసం సితార నుండి అడ్వాన్సు వెళ్లిందట. వీళ్లు కాకుండా మరో దర్శకుడు కూడా సితార నుండి అడ్వాన్సు అందుకున్నారని, వారితో కూడా త్వరలోనే నాగవంశీ సినిమాలు నిర్మిస్తారని సమాచారం. మరి ఇదే స్పీడుతో కంటిన్యూ అయితే సితార బ్యానర్ నుండి ఏడాదికి మూడు సినిమాలు గ్యారెంటీ అనిపిస్తుంది.