రవితేజ నుంచి బ్యాక్ టు బ్యాక్ మూవీస్

Wednesday,October 25,2017 - 05:44 by Z_CLU

మాస్ మహారాజ్ రవితేజ మరోసారి స్పీడ్ పెంచాడు. రాజా ది గ్రేట్ సినిమా సక్సెస్ అవ్వడంతో ఇకపై వరుసపెట్టి సినిమాలు చేయడానికి ప్లాన్ చేస్తున్నాడు రవితేజ. ఇందులో భాగంగా ఒకేసారి 2 సినిమాలు లైన్లోపెట్టాడు. శ్రీనువైట్ల దర్శకత్వంలో ఓ మూవీ చేయడానికి రెడీ అవుతున్నాడు మాస్ రాజా. మరోవైపు తమిళ్ లో సూపర్ హిట్ అయిన బోగన్ సినిమా రీమేక్ కూ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. ఈ రెండు సినిమాల్ని జనవరి నుంచి ప్రారంభించి సైమల్టేనియస్ గా పూర్తిచేయాలనేది రవితేజ టార్గెట్.

ప్రస్తుతానికి రవితేజ చేతిలో టచ్ చేసి చూడు సినిమా ఉంది. విక్రమ్ సిరి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాను ఈ 2 నెలల్లో పూర్తిచేసి, వచ్చే ఏడాదికి పైన చెప్పుకున్న 2 సినిమాల్ని సెట్స్ పైకి తీసుకురావాలని రవితేజ ఫిక్స్ అయ్యాడు. శ్రీనువైట్లతో సినిమా, బోగన్ రీమేక్స్ పై త్వరలోనే అఫీషియల్ ఎనౌన్స్ మెంట్ రానుంది.