బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో అల్లరోడు

Saturday,July 04,2020 - 01:32 by Z_CLU

అల్లరి నరేష్ నుండి ఏడాదికి రెండు మూడు సినిమాలు థియేటర్స్ లోకి వచ్చేవి. ఇది ఒకప్పటి మాట ఈ మధ్య అల్లరోడి స్పీడుకి బ్రేక్ పడింది. గతంలో చేసినట్టు హీరోగా వరుస సినిమాలు చేయకపోవడమే దీనికి రీజన్. అయితే ‘మహర్షి’ ఇచ్చిన సక్సెస్ తో మళ్ళీ హీరోగా వరుస సినిమాలు చేస్తూ ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు ఈ హీరో..

ప్రస్తుతం అల్లరి నరేష్ చేతిలో రెండు సినిమాలున్నాయి. అందులో ఒకటి కామెడీ ఎంటర్టైనర్ ‘బంగారు బుల్లోడు’ కాగా మరొకటి క్రైం థ్రిల్లర్ గా తెరకెక్కుతున్న ‘నాంది’.

బంగారు బుల్లోడు రిలీజ్ కి రెడీగా ఉంది. నాంది షూటింగ్ చివరి దశలో ఉంది. ఫైనల్ షెడ్యుల్ అవ్వగానే రిలీజ్ కి రెడీ అవుతుంది.

ఈ లెక్కన చూస్తే ముందు బంగారు బుల్లోడు ప్రేక్షకుల ముందుకు రానుంది. రెండు మూడు నెలల గ్యాప్ లోనే నాంది కూడా రిలీజ్ అవుతుంది.

అంటే అల్లరోడు బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో మళ్ళీ మునుపటిలా అలరిస్తాడన్నమాట. ఇక ఈ రెండు కాకుండా మరో రెండు ప్రాజెక్ట్స్ ను రెడీ టూ షూట్ మోడ్ లో పెట్టాడు నరేష్. అవి కూడా త్వరలోనే సెట్స్ పైకి రాబోతున్నాయి.