Baby Teaser స్వచ్చమైన ప్రేమ

Tuesday,November 22,2022 - 02:06 by Z_CLU

Baby Teaser – A school love story

ఆనంద్ దేవరకొండ (Anand Deverakonda) విరాజ్ అశ్విన్, వైష్ణవి చైతన్య నటిస్తున్న కొత్త సినిమా ‘బేబీ’ (Baby). మాస్ మూవీ మేకర్స్ బేనర్ పై ఎస్ కే ఎన్ నిర్మిస్తున్న ఈ సినిమాకు సాయి రాజేష్ దర్శకత్వం వహిస్తున్నారు. రీసెంట్ గా షూట్ కంప్లీట్ చేసుకున్న ఈ సినిమాకు సంబంధించి తాజాగా టీజర్ రిలీజ్ చేశారు.

” మొదటి ప్రేమకి మరణం లేదు …మనసు పొరల్లో శాశ్వతంగా సమాధి చేయబడి ఉంటుంది. ” అనే అక్షరాలతో మొదలైన టీజర్ స్వచ్చమైన ప్రేమ సన్నివేశాలతో మెప్పించింది. స్కూల్ లో ఆనంద్ దేవరకొండ నడుస్తూ వచ్చే మొదటి షాట్ నుండి చివర్లో రెండు చేతుల కరచాలనం షాట్ వరకూ టీజర్ ఆకట్టుకుంది. ముఖ్యంగా బాల్ రెడ్డి విజువల్స్ , విజయ్ బుల్గానిన్ మ్యూజిక్ టీజర్ లో ప్లస్ పాయింట్స్ అనిపించాయి. అలాగే ఆనంద్ దేవరకొండ- వైష్ణవి చైతన్య వచ్చే సన్నివేశాలతో పాటు ఇళయరాజా పెయింటింగ్ విజువల్ స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలిచాయి.

స్కూల్ డేస్ లవ్ స్టోరీతో తెరకెక్కిన ఈస్వచ్చమైన ప్రేమకథ త్వరలోనే థియేటర్స్ లోకి రాబోతుంది. అతి త్వరలోనే రిలీజ్ డేట్ ప్రకటించబోతున్నారు.

 

  • Follow Us for Latest Telugu Zee Cinemalu News and upcoming trending stories, Gossips, Actress Photos and Special topics