వెంకీ ఖాతాలో మరో విక్టరీ

Friday,September 30,2016 - 02:08 by Z_CLU

అయ్యో..అయ్యో..అయ్యయ్యో.. అంటూ వెంకీ ఆన్ స్క్రీన్ చేసిన అల్లరి 50 రోజులకు చేరుకుంది. జాలి డోసు కాస్త ఎక్కువగా ఉండే పోలీసాఫీసర్ గా నటించి వెంకీ బాబు “బాబు బంగారం” సినిమాతో లేడీ ఫ్యాన్స్ లో ఇంకా తన ప్లేస్ చెక్కు చెదరలేదనిపించుకున్నాడు.  కావాల్సినంత కామెడీ, కూసంత యాక్షన్, సందర్భానుసారంగా ఇమిడిపోయిన ఎమోషన్స్ తో మారుతి డైరెక్షన్ లో తెరకెక్కిన ‘బాబు బంగారం’ వెండితెరపై బంగారుకాసులు కురిపించింది.

wall-1

ఎంచుకున్న కథలో యాక్షన్, కామెడీ లాంటివి ఉన్నా, లేకపోయినా స్టోరీలైన్ కొత్తగా ఉందా లేదా… అన్ని వర్గాలకు చేరువ అవుతుందా లేదా.. అన్నదే వెంకీ ఫస్ట్ ప్రయారిటీ. ఆ విషయంలో ఓకే అనుకున్నాకే మిగతా అంశాలపై ఫోకస్ పెడతాడు. ఆ విషయం తెలుసు కాబట్టే మారుతి ముందుగానే బంగారం లాంటి కాన్సెప్ట్ ని ప్లాన్ చేసుకుని సినిమాని తెరకెక్కించాడు. మొత్తానికి టైటిల్ కి తగ్గట్టే బాబుతో పాటు సినిమా కూడా బంగారం అనిపించుకుంది.