500 కోట్లు దాటిన బాహుబలి 2 ప్రీ రిలీజ్ బిజినెస్

Thursday,February 02,2017 - 02:59 by Z_CLU

బాహుబలి ప్రీ రిలీజ్ బిజినెస్ చూస్తుంటే బాహుబలిని కట్టప్ప ఎందుకు చంపాడో అన్న క్యూరాసిటీ కూడా లైట్ అనిపిస్తుంది. ఇండియన్ సినిమా స్టాండర్డ్స్ ని ప్రపంచం ముందు బాహాటంగా నిలబెట్టిన బాహుబలి కంక్లూజన్ ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ జరుపుకుంటుంది. ఈ లోపు రిలీజ్ బిజినెస్ దగ్గరి నుండి, ప్రమోషన్ ప్లానింగ్స్ లాంటి పనులపై ఫోకస్ పెట్టింది సినిమా యూనిట్.

అక్షరాలా 120 కోట్లు చెల్లించి మరీ బాహుబలి హిందీ రైట్స్ ని బ్యాగ్ లో వేసుకున్నాడు కరణ్ జోహార్. నార్త్ అమెరికా రైట్స్ 45 కోట్లు, కర్నాటక 45 కోట్లు, తమిళనాడు 47 కోట్లు ఇలా హై ఎండ్ డిమాండ్ లో ఉన్న బాహుబలి కంక్లూజన్, స్యాటిలైట్ రైట్స్ తో పాటు కలిపి 500 కోట్ల రౌండ్ ఫిగర్ ని ఆల్ రెడీ రీచ్ అయిపోయింది. USA కాకుండా తక్కిన ఓవర్ సీస్ బిజినెస్ ఇంకా జరగాల్సి ఉంది.

bahubali

బిగినింగ్ నుండే హై ఎండ్ డిమాండ్ ఉన్న బాహుబలి కంక్లూజన్, బాహుబలి ఫస్ట్ పార్ట్ కన్నా బావుంటుందని సినిమా యూనిట్ చేస్తున్న ప్రమోషన్స్ తో, బాహుబలి ఫీవర్ డోస్ రోజు రోజుకి పెరుగుతూనే ఉంది. ఈ సినిమా ఏప్రిల్ 28 న రిలీజ్ కి రెడీ అవుతుంది.