తెలుగు రాష్ట్రాల్లో బాహుబలి-2 ఫస్ట్ వీక్ కలెక్షన్స్....

Friday,May 05,2017 - 04:17 by Z_CLU

బాహుబలి-2 రిలీజ్ అయి వారం పూర్తయింది…తొలి రోజు నుంచి బిగ్గెస్ట్ హిట్ టాక్ సొంతం చేసుకున్న ఈ సినిమా వారం రోజుల్లోనే తెలుగు రాష్ట్రాల్లో  100 కోట్ల మార్క్ ను అవలీలగా క్రాస్ చేసి హౌస్ ఫుల్ కలెక్షన్ తో రిర్డులను అధిగమిస్తూ దూసుకెళ్తుంది.. ఏప్రిల్ 28 వరల్డ్ వైడ్ గా రిలీజ్ అయిన ఈ సినిమా తెలుగు రాష్ట్రాల్లో అన్ని ఏరియాల్లో రికార్డులను తిరగరాస్తూ అదరగొడుతుంది. రాజమౌళి దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా సినీ జనాలను ఎట్రాక్ట్ చేస్తూ థియేటర్స్ కి పరుగులు పెట్టిస్తుంది… ఇప్పటికే ఇండియన్ మార్కెట్ లో భారీ వాసుల్లో సాధిస్తూ ఇండియాస్ బిగ్గెస్ట్ హిట్ గా నిలిచిన ఈ సినిమా తెలుగు రాష్ట్రాల్లో ఫస్ట్ వీక్ ఎంత కలెక్ట్ చేసిందో..చూద్దాం..

 

తెలుగు రాష్ట్రాల్లో ‘బాహుబలి-2’ ఫస్ట్ వీక్ షేర్

నైజాం : రూ 35 .75 కోట్లు
సీడెడ్ : రూ 21 కోట్లు
ఉత్తరాంధ్ర : రూ 15 .12 కోట్లు
వెస్ట్ : రూ 9 .29 కోట్లు
ఈస్ట్ : రూ 11.97 కోట్లు
గుంటూరు : 11 .95 రూ కోట్లు
కృష్ణ : రూ 8 .39 కోట్లు
నెల్లూరు : రూ 4 .56 కోట్లు

తెలుగు రాష్ట్రాల్లో మొత్తం షేర్ – 118.03