మరింత హీట్ పెంచుతున్న రాజమౌళి

Monday,March 13,2017 - 11:30 by Z_CLU

బాహుబలి ది కంక్లూజన్ సినిమాకు సంబంధించి ఈనెల 16న ట్రయిలర్ విడుదలకానుంది. ఆ రోజు కోసం ప్రేక్షకులంతా ఆశగా ఎదురుచూస్తున్నారు. అయితే రాజమౌళి మాత్రం 16వ తేదీ వరకు ఆగడం లేదు. ఈరోజు నుంచే బాహుబలి-2 హీట్ ను పెంచే ప్రయత్నం చేస్తున్నాడు. ఇందులో భాగంగా Three Days to Go అంటూ రాజమౌళి రిలీజ్ చేసిన ఓ చిన్న టీజర్ అందర్నీ ఎట్రాక్ట్ చేస్తోంది. ఇందులో కేవలం శివలింగం, ప్రభాస్ కనిపించేలా ఒకేఒక్క షాట్ మాత్రమే ఉంది. కానీ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ తో పాటు విడుదలైైన ఆ ఒక్క ఫ్రేమ్, ప్రేక్షకుల్ని విపరీతంగా ఆకర్షిస్తోంది.

బాహుబలి ది కంక్లూజన్ సినిమాపై భారీ అంచనాలున్నాయి. ఇప్పటికే భారీ స్థాయిలో ప్రీ-రిలీజ్ బిజినెస్ కూడా పూర్తయింది. కీరవాణి మ్యూజిక్ అందించిన ఈ సినిమా పాటల్ని ఈనెల 25న విడుదల చేసే ఆలోచనలో ఉన్నారు. ఇక సినిమాను ఏప్రిల్ 28న థియేటర్లలోకి తీసుకురానున్నారు.