ఆ వార్తలో నిజం లేదంటున్న బాహుబలి టీం...

Tuesday,February 14,2017 - 07:08 by Z_CLU

ప్రభాస్, రానా, అనుష్క, తమన్నలతో రాజమౌళి తెరకెక్కించిన సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ హిట్ మూవీ ‘బాహుబలి’ ఎంతటి ఘన విజయం సాధించిందో తెలిసిందే. ఆ సినిమాకు సీక్వెల్ గా తెరకెక్కుతున్న ‘బాహుబలి-2’ ఇటీవలే షూటింగ్ పూర్తి చేసుకొని పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటుంది. ఏప్రిల్ 28న రిలీజ్ కి   రెడీ అవుతున్న ఈ సినిమాలో బాలీవుడ్ సూపర్ స్టార్ షారుక్ ఖాన్ ఓ స్పెషల్ గెస్ట్ రోల్ చేశాడనే వార్త టాలీవుడ్ చక్కర్లు కొడుతుంది..

sharukh-khan-with-senthil

ఈ న్యూస్ ను లేటెస్ట్ గా  ఖండించిన యూనిట్ ఆ వార్తలో నిజం లేదని తేల్చి చెప్పేసింది. గతం లో కూడా ‘బాహుబలి 2’ లో సూర్య తో పాటు పలు స్టార్ హీరోలు గెస్ట్ రోల్స్ చేయబోతున్నారనే వార్తలు వినిపించగా అలాంటిదేం లేదని అసలు కథలో అలాంటి ప్రత్యేక పాత్రలు కనిపించవని తేల్చి చెప్పాడు జక్కన్న. అయితే మరో సారి అలాంటి వార్తే ప్రెజెంట్ సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుండడంతో అది కేవలం రూమర్ మాత్రమే అని కొట్టిపారేశారు యూనిట్….

baahubali-tweet