మరోసారి తెరపైకి బాహుబలి కాంబినేషన్?

Thursday,July 06,2017 - 02:10 by Z_CLU

ప్రభాస్- అనుష్క కాంబినేషన్ లో తెరకెక్కిన ‘బాహుబలి’ ఎంతటి బిగ్గెస్ట్ హిట్ సాధించిందో తెలిసిందే. తెలుగు సినిమా స్థాయిని ప్రపంచ దేశాలకు చాటిచెప్పిన ఈ సినిమాతో  ఇంటర్నేషనల్ జోడీగా గుర్తింపు తెచ్చుకున్నారు ప్రభాస్ -అనుష్క. మరోసారి ఈ కాంబోను రిపీట్ చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయి. అదే ప్రభాస్ లేటెస్ట్ మూవీ ‘సాహో’ .

భారీ బడ్జెట్ తో స్టైలిష్ యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న సాహోలో ప్రభాస్ కి జోడీగా మరోసారి అనుష్కను అనుకుంటున్నారు. బాలీవుడ్ బ్యూటీస్ కత్రినా కైఫ్,పరిణితి చోప్రా, ఆలియా భట్,  పూజా హెగ్డే పేర్లు మొన్నటివరకు వినిపించాయి.. ఈమధ్య కాజల్, శృతి హాసన్, రకుల్ పేర్లు కూడా వినిపించాయి. ఫైనల్ గా అనుష్క వైపు చూస్తున్నారట.

తెలుగు-తమిళ-హిందీ-మలయాళ భాషల్లో ఒకేసారి సాహో సినిమాను రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. 150 కోట్ల రూపాయల ఈ భారీ బడ్జెట్ సినిమాలో బాహుబలి పెయిర్ ను మరోసారి చూపిస్తే జాతీయస్థాయిలో సినిమాకు హైప్ వస్తుందని మేకర్స్ ఫీలింగ్.