గుమ్మడికాయ కొట్టేసిన బాహుబలి

Friday,January 06,2017 - 06:38 by Z_CLU

దాదాపు మూడున్నరేళ్ల సుదీర్ఘ ప్రస్థానం ముగిసింది. రాజమౌళితో పాటు యావత్ తెలుగు పరిశ్రమ ప్రతిష్టాత్మకంగా భావించిన బాహుబలి-2 షూటింగ్ కంప్లీట్ అయింది. ఈ రోజు ఈ సినిమాకు గుమ్మడికాయ కొట్టేశారు. ఈ చారిత్రక కార్యక్రమంలో జక్కన్నతో పాటు యూనిట్ కు సంబంధించిన సభ్యులంతా పాల్గొన్నారు. ఈ సినిమా లాంఛింగ్ నుంచి అన్నీ తామై నడిపించిన రాజమౌళి-ప్రభాస్ కలిసి గుమ్మడికాయ కొట్టారు. ఈ సందర్భంగా గుమ్మడికాయ పట్టుకున్న ప్రభాస్ ఫొటో కూడా నెట్ లో విడుదలైంది.

prabhas-with-pumpkin

బాహుబలి పార్ట్-2, పార్ట్-2 కలిపి మొత్తంగా 613 రోజులు షూట్ చేశారు. ఈ మొత్తం కాలంలో కేవలం దర్శకుడు మాత్రమే కాకుండా.. యూనిట్ సభ్యులంతా ఈ సినిమానే లోకంగా జీవించారు. ప్రభాస్ అయితే ఏకంగా మూడున్నరేళ్ల పాటు ఈ సినిమాకే అంకితమైపోయాడు. బాహుబలి-2 కంప్లీట్ అయ్యేంతవరకు పెళ్లి కూడా చేసుకోకూడదని నిర్ణయించుకున్నాడు. ఇప్పటికే విడుదలైన తొలిభాగం ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. 6వందల కోట్ల రూపాయలకు పైగా వసూళ్లు సాధించి తెలుగు సినిమా రేంజ్ ను పెంచింది. తాజాగా షూటింగ్ పూర్తిచేసుకున్న బాహుబలి-2 కూడా అదే రేంజ్ లో హిట్ అవుతుందని అంతా ఎక్స్ పెక్ట్ చేస్తున్నారు.

bahubali

 

కట్టప్ప బాహుబలిని హత్య చేయడంతో పార్ట్-1 ముగుస్తుంది. అప్పట్నుంచి ఇప్పటివరకు అత్యంత నమ్మకస్తుడైన, విధేయుడైన కట్టప్ప ఎందుకు బాహుబలిని చంపాడనే ప్రశ్న ఆడియన్స్ మదిని తొలుస్తూనే ఉంది. ఇదే బాహుబలి-2కు అతిపెద్ద ప్రచార అస్త్రం. దీంతో పాటు మరెన్నో సరికొత్త ప్రమోషనల్ ఎలిమెంట్స్ తో బాహుబలి-2కు ప్రచారం కల్పిస్తున్నారు. ఏప్రిల్ 28న ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి రానుంది.

https://twitter.com/BaahubaliMovie/status/817355256057253888