బాహుబలి నుంచి మరో సిరీస్

Wednesday,January 18,2017 - 07:10 by Z_CLU

ప్రభాస్, రానా, అనుష్క, తమన్నా లతో దర్శకుడు రాజమౌళి రూపొందించిన ‘బాహుబలి’ సినిమా ఇప్పటికే చాలా రకాల సిరీస్ తో హంగామా చేస్తుండగా ఇక త్వరలోనే బుక్ సిరీస్ తో మరో సారి హల్చల్ చేయబోతుంది. ఈ సినిమాకు సంబంధించిన నవల మూడు సిరీస్ గా ఓ బుక్ రూపం లో రిలీజ్ కానుంది.

c2bpoduwqamjlyl

ఆనంద్ నీలకంఠన్ అనే రచయిత రాసిన ఈ నావెల్ ట్రైయాలజీ బుక్ మూడు సిరీస్ గా రిలీజ్ అయి బాహుబలి అభిమానుల్లో మరింత ఉత్సాహం నింపే బోతుంది. ముందుగా సినిమా మొదలు కాక ముందు జరిగిన శివగామి కథ తో ‘ది రైస్ ఆఫ్ శివగామి’ అనే బుక్ విడుదల చేయబోతున్నారు.

ఈ బుక్ పై ‘శివ గామి’ స్టిల్ తో ఉండే పవర్ ఫుల్ కవర్ ను జనవరి 20 న ‘జీ జైపూర్ లిట్ ఫెస్టివల్’ లో రాజమౌళి, రానా, నిర్మాత ప్రసాద్ దేవినేని కలిసి గ్రాండ్ గా రిలీజ్ చేయనున్నారు. ఈ కవర్ రిలీజ్ ఫంక్షన్ లో ఈ బుక్ రిలీజ్ డేట్ ను ప్రకటించనున్నారు ఆనంద్ నీలకంఠన్. అంటే త్వరలోనే ఈ మూడు సిరీస్ గల బుక్స్ మార్కెట్ లో సందడి చేయబోతుందన్నమాట.