వరల్డ్ వైడ్ అదరగొడుతున్న బాహుబలి-2

Saturday,May 13,2017 - 11:50 by Z_CLU

రాజమౌళి దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా నటించిన బాహుబలి-2 సినిమా ప్రపంచవ్యాప్తంగా సంచలనాలు సృష్టిస్తోంది. ప్రతి రోజు, ప్రతి వారం ఈ సినిమా కలెక్షన్ల కౌంట్ పెరుగుతూనే ఉంది. అలా 2 వారాల రన్ పూర్తిచేసుకున్న బాహుబలి – ది కంక్లూజన్ సినిమా 1250 కోట్ల రూపాయల గ్రాస్ సాధించింది. మొన్నటికి మొన్న 1000 కోట్ల క్లబ్ లోకి ఎంటరైన ఈ సినిమా.. జస్ట్ 3 రోజుల గ్యాప్ లోనే మరో 250 కోట్ల రూపాయల్ని తన ఖాతాలో వేసుకుంది. ప్రస్తుతానికి బాహుబలి-2 బ్రేకప్ ఇలా ఉంది.

కేరళ – 50 కోట్లు గ్రాస్
తమిళనాడు – 100 కోట్ల గ్రాస్
ఏపీ, తెలంగాణ – 250 కోట్ల గ్రాస్
హిందీ వెర్షన్ నెట్ – 400 కోట్లు
ఓవర్సీస్ తో పాటు రెస్టాఫ్ ది వరల్డ్ – 450 కోట్ల గ్రాస్