బాహుబలి-2 ట్రయిలర్ రిలీజ్ డేట్ ఫిక్స్

Saturday,March 11,2017 - 04:34 by Z_CLU

బాహుబలి – ది కంక్లూజన్ ట్రయిలర్ రిలీజ్ డేట్ ను అఫీషియల్ గా ఎనౌన్స్ చేశారు. ఈ సినిమా ట్రయిలర్ ను మార్చి 16 ఉదయం విడుదల చేయబోతున్నట్టు హీరో ప్రభాస్ ప్రకటించాడు. కొన్ని పరిమిత థియేటర్లలో 16వ తేదీ ఉదయం బాహుబలి-2 ట్రయిలర్ ను ప్రసారం చేస్తారు. అదే రోజు సాయంత్రం 5 గంటలకు సోషల్ మీడియాలో బాహుబలి – ది కంక్లూజన్ ట్రయిలర్ ను విడుదల చేస్తారు. ఈ విషయాలన్నింటినీ స్వయంగా ప్రభాస్ రివీల్ చేయడం విశేషం.

ప్రపంచవ్యాప్తంగా బాహుబలి-2 సినిమాపై భారీ అంచనాలున్నాయి. రాజమౌళి దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో భళ్లాలదేవుడిగా నెగెటివ్ షేడ్స్ లో కనిపించనున్నాడు రానా. తమన్న, అనుష్క హీరోయిన్లుగా నటిస్తున్నారు. షూటింగ్ పూర్తిచేసుకున్న ఈ సినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ స్టేజ్ లో ఉంది. ట్రయిలర్ రిలీజ్ అయిన వెంటనే, ఆడియో రిలీజ్ డేట్ ను కూడా అఫీషియల్ గా వెల్లడిస్తారు. సినిమాను ఏప్రిల్ 28న థియేటర్లలోకి తీసుకురాబోతున్నారు.