రికార్డుల మీద రికార్డులు

Friday,March 17,2017 - 10:12 by Z_CLU

బాహుబలి ది కంక్లూజన్ ట్రయిలర్ ఇలా విడుదలైందో లేదో అలా రికార్డుల వేట మొదలుపెట్టేసింది. యూట్యూబ్ లో ట్రయిలర్ విడుదలైన గంట నుంచే రికార్డులు క్రియేట్ అవ్వడం స్టార్ట్ అయ్యాయి. అలా జస్ట్ 8 గంటల్లోనే కోటి వ్యూస్ సాధించింది బాహుబలి-2 ట్రయిలర్. ఇదే ఓ రికార్డు అనుకుంటే… ట్రయిలర్ విడుదలై 24 గంటలైనా కాాకముందే… 2కోట్ల వ్యూస్ వచ్చాయి. టాలీవుడ్ చరిత్రలోనే ఇదొక బిగ్ రికార్డు.

జస్ట్ 21 గంటల్లోనే 2 కోట్ల 10లక్షల వ్యూస్ సాధించింది బాహుబలి-2 ట్రయిలర్. ఈ ఫీట్ తో షారూక్ సినిమానే క్రాస్ చేసింది బాహుబలి-2. షాారూక్ లేేటెస్ట్ మూవీ రాయీస్ ట్రయిలర్ కు సోషల్ మీడియాలో 24 గంటల్లో 2కోట్ల వ్యూస్ వచ్చాయి. ఈ రికార్డును బాహుబలి ది కంక్లూజన్ ట్రయిలర్ అధిగమించింది.

సినిమాపై భారీ అంచనాలు ఉండడం, ట్రయిలర్ కోసం ఆడియన్స్ చాలా రోజులుగా వెయిట్ చేస్తుండమే ఈ ప్రభంజనానికి కారణం. దీనికి తోడు ఉత్తరాది ప్రేక్షకులు కూడా బాహుబలి-2 కోసం ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. అందుకే ఈ సినిమా ట్రయిలర్ కు రికార్డు వ్యూస్ వస్తున్నాయి.