షారూక్ సినిమాతో పాటు బాహుబలి-2

Friday,January 06,2017 - 08:05 by Z_CLU

బాహుబలి-2 సినిమాకు గుమ్మడికాయ కొట్టేశారు. ఇక దశలవారిగా ఫస్ట్ లుక్స్, టీజర్స్, ట్రయిలర్స్ విడుదల చేయడమే ఆలస్యం. ప్రమోషనల్ యాాక్టివిటీస్ కు సంబంధించి ఇప్పటికే డీటెయిల్స్ వెల్లడించిన దర్శకుడు రాజమౌళి… తన ప్రతిష్టాత్మక సినిమాకు సంబంధించి ఇప్పుడు మరో కీలకమైన నిర్ణయం తీసుకున్నాడు. అన్నీ అనుకున్నట్టు జరిగితే, షారూక్ కొత్త సినిమాతో బాహుబలి-2 టీజర్ ట్రయిలర్ ను విడుదల చేయాలని రాజమౌళి భావిస్తున్నాడు.

షారూక్ లేటెస్ట్ మూవీ రాాయీస్. జనవరి 25న విడుదలకానున్న ఈ సినిమాపై భారీ అంచనాలున్నాయి. ఇప్పటికే విడుదలైన ట్రయిలర్, సాంగ్స్ కు మంచి రెస్పాన్స్ రావడంతో అందరి దృష్టి ఇప్పుడు కింగ్ ఖాన్ పై పడింది. పైగా షారూక్ కు స్వదేశంతో పాటు.. ఓవర్సీస్ లో విపరీతమైన ఫాలోయింగ్ ఉంది. అన్ని వర్గాల ప్రేక్షకులు, అన్ని భాషల ఆడియన్స్ షారూఖ్ సినిమాలు చూస్తారు. అందుకే రాయీస్ సినిమా ఇంటర్వెల్ సమయంలో బాహుబలి-2 టీజర్ ట్రయిలర్ ను ప్రసారం చేయాలని భావిస్తున్నారట.