మరోసారి అంచనాలను పెంచేశాడు...

Saturday,April 22,2017 - 06:30 by Z_CLU

యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్, రానా, అనుష్క, తమన్నా, రమ్య కృష్ణ, సత్య రాజ్ లతో రాజమౌళి తెరకెక్కించిన బాహుబలి-2 ఏప్రిల్ 28 న గ్రాండ్ గా రిలీజ్ అవుతున్న సంగతి తెలిసిందే.. ప్రపంచ వ్యాప్తంగా ఎప్పుడెప్పుడు చూద్దామా? అని ఎదురుచూస్తున్న సినిమా ప్రేక్షకుల కోసం సినిమాలోని ‘సాహోరే బాహుబలి’ అనే సాంగ్ ప్రోమో ను సోషల్ మీడియా ద్వారా రిలీజ్ చేశారు మేకర్స్..

ప్రస్తుతం ఈ ప్రోమో సాంగ్ అందరినీ అట్రాక్ట్ చేస్తూ సోషల్ మీడియా లో హల్చల్ చేస్తూ ట్రెండ్ అవుతుంది.. ప్రోమో లో ప్రభాస్ రాజసం చూపించే సన్నివేశాలు, యుద్ధ సన్నివేశాలు సినిమా పై మరో సారి భారీ అంచనాలను పెంచేశాయి.. ఇప్పటికే పోస్టర్స్, మోషన్ పోస్టర్, ట్రైలర్ సినిమా పై భారీ హైప్ క్రేయేట్ చేసిన రాజమౌళి లేటెస్ట్ గా రిలీజ్ చేసిన ప్రోమో సాంగ్ తో ఆ అంచనాలను తారా స్థాయికి తీసుకెళ్లాడు. ప్రస్తుతం అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమా ఏప్రిల్ 28 న ప్రపంచ వ్యాప్తంగా సందడి చేయడానికి సిద్ధం అయింది.