బాహుబలి-2 ఇంగ్లిష్ వెర్షన్

Thursday,May 25,2017 - 05:37 by Z_CLU

మరిన్ని వసూళ్లు సాధించడం కోసం అల్టిమేట్ స్కెచ్ రెడీ చేసింది బాహుబలి యూనిట్. అన్నీ అనుకున్నట్టు జరిగితే త్వరలోనే బాహుబలి ది కంక్లూజన్ ఇంగ్లిష్ వెర్షన్ రెడీ అవుతుంది. ఈ మేరకు ఎలా చేస్తే బాగుంటుందనే ఆలోచనలో ఉంది యూనిట్. ప్రస్తుతం నడుస్తున్న రూమర్ల ప్రకారం.. ఎట్టిపరిస్థితుల్లో ఇంగ్లిష్ వెర్షన్ తీసుకురావాలనే పట్టుదలతోనే ఉన్నారట మేకర్స్

ఇంగ్లిష్ వెర్షన్ కు సంబంధించి అద్భుతమైన ఆలోచన చేస్తోందట బాహుబలి టీం. బాహుబలి పార్ట్-1, పార్ట్-2 రెండింటినీ కలిపి, ఒకే సినిమాగా చేసి, ఇంగ్లిష్ డబ్బింగ్ చెప్పించి రిలీజ్ చేయాలనే ఆలోచనలో ఉన్నారట. మొత్తంగా సినిమాను రెండున్నర గంటలు చేయాలనేది ప్లాన్. ఇందులో నిజమెంతో తెలీదు కానీ ఆలోచన మాత్రం అదిరిపోయింది కదా.

త్వరలోనే ఇంగ్లిష్ వెర్షన్ పై ఓ క్లారిటీ రాబోతోంది. ఇంగ్లిష్ వెర్షన్ సిద్ధమైతే బాహుబలి వసూళ్లు మరింత పెరిగే అవకాశం ఉంది. ఇంగ్లిష్ వెర్షన్ తో పాటు చైనాలో కూడా బాహుబలి-2 సినిమాను విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారట.