బాలీవుడ్ నంబర్ వన్ బాహుబలి-2

Friday,May 05,2017 - 03:12 by Z_CLU

టాలీవుడ్ లో బాహుబలి-2 సినిమా నంబర్ వన్ పొజిషన్ కు వస్తే మజా ఏముంటుంది. బాలీవుడ్ లో నంబరవన్ వస్తే ఆ కిక్కే వేరు. ప్రతి తెలుగు ప్రేక్షకుడికి అలాంటి కిక్ ను అందించింది బాహుబలి-ది కంక్లూజన్ మూవీ. అవును.. బాలీవుడ్ లో ఇప్పుడు నంబర్ వన్ సినిమా ఇదే. మొదటి వారం వసూళ్లలో అన్ని బాలీవుడ్ సినిమాల్ని క్రాస్ చేసి నంబర్-1గా నిలిచింది బాహుబలి-2 హిందీ వెర్షన్.

విడుదలైన మొదటి వారంలో భారీ వసూళ్లు సాాధించిన సినిమా ఇప్పటివరకు సుల్తాన్ మాత్రమే. సల్మాన్ నటించిన సుల్తాన్ సినిమా బుధవారం రిలీజ్ అవ్వడంతో మొదటి వారం వసూళ్లు బాగానే వచ్చాయి. అలా విడుదలైన 9 రోజుల్లో 229 కోట్లు కలెక్ట్ చేసింది సుల్తాన్. ఇప్పుడీ రికార్డును జస్ట్ వారం రోజుల్లో అధిగమించింది బాహుబలి-2. ఈ సినిమా హిందీ వెర్షన్ కు 7 రోజుల్లో 247 కోట్ల రూపాయలు వచ్చాయి.

బాలీవుడ్ లో ఫస్ట్ వీక్ వసూళ్లలో మొదటి 3 సినిమాలు (గ్రాస్)
బాహుబలి-2 (హిందీ వెర్షన్) – 247 కోట్లు (7 రోజుల్లో)
సుల్తాన్ – 229 కోట్లు (9 రోజుల్లో)
దంగల్ – 197 కోట్లు (7 రోజుల్లో)