అమెరికాలో బాహుబలి ప్రభంజనం

Saturday,April 15,2017 - 04:04 by Z_CLU

ఈనెల 28న బాహుబలి-2 గ్రాండ్ గా విడుదలకానుంది. ఈ మేరకు ఏర్పాట్లు చకచకా జరుగుతున్నాయి. ఓవర్సీస్ కు సంబంధించి ఇప్పటికే ఏర్పాట్లు పూర్తయ్యాయి. తాజా సమాచారం ప్రకారం.. అమెరికా, కెనడా దేశాల్లో 1050 స్క్రీన్స్ పై బాహుబలి-2 సినిమా గ్రాండ్ గా విడుదలకానుంది. ఇందులో 900 థియేటర్లు అమెరికాలో ఉంటే.. మిగతా 150 తెరలు కెనడాలో ఉన్నాయి. ఇంత భారీ స్థాయిలో ఓ తెలుగు సినిమా విడుదలకావడం ఇదే ఫస్ట్ టైం

అమెరికాలో బాహుబలి – ది కంక్లూజన్ తెలుగు వెర్షన్ 4వందల తెరలపై విడుదలకానుంది. ఇక హిందీ వెర్షన్ 300 తెరలపై, తమిళ వెర్షన్ ను 2వందల స్క్రీన్స్ పై రిలీజ్ చేయనున్నారు. వీటిలో ఐమ్యాక్స్ వెర్షన్స్ కూడా ఉన్నాయి. అమెరికాలోని కొన్ని సెలక్టివ్ లొకేషన్స్ లో బాహుబలి-2 ఐమ్యాక్స్ వెర్షన్ ను ప్రదర్శించనున్నారు.

ఈ సినిమాకు సంబంధించి ప్రీమియర్ షోలు ఈనెల 27 నుంచే ప్రారంభం అవుతున్నాయి. సో.. ఇండియాలో బాహుబలి-2 రిలీజ్ అయ్యే టైమ్ కే ఓవర్సీస్ నుంచి టాక్ వచ్చేస్తుందన్నమాట. రాజమౌళి తెరకెక్కించిన ఈ భారీ బడ్జెట్ సినిమాపై భారీ అంచనాలున్నాయి.