మరో రికార్డు సృష్టించిన బాహుబలి-2

Friday,May 12,2017 - 11:30 by Z_CLU

బాహుబలి – ది కంక్లూజన్ సినిమా విడుదలై సరిగ్గా 2 వారాలైంది. ఈ 14 రోజుల్లో ఎన్నో రికార్డులు సృష్టించిన ఈ సినిమా తాజాగా మరో రికార్డు కూడా అందుకుంది. అమీర్ ఖాన్ నటించిన దంగల్ సినిమా క్రియేట్ చేసిన రికార్డును క్రాస్ చేసింది. మొన్నటివరకు ఇండియాలో అత్యధిక వసూళ్ల రికార్డు దంగల్ పేరిట ఉండేది. ఇప్పుడా రికార్డు బాహుబలి-2 వశమైంది.

అమీర్ నటించిన దంగల్ సినిమాకు ఫైనల్ రన్ లో 387 కోట్ల రూపాయల షేర్ వచ్చింది. ఇప్పుడీ రికార్డును జస్ట్ 2 వారాల్లోనే క్రాస్ చేసింది బాహుబలి -2. ఈ సినిమా హిందీ వెర్షన్ కు బాలీవుడ్ లో ఇప్పటివరకు 392 కోట్ల రూపాయల షేర్ వచ్చింది. అలా ఇండియాలో అత్యధిక వసూళ్లు సాధించిన సినిమాగా బాహుబలి-2 చరిత్ర సృష్టించింది.

ఈ వీకెండ్ నాటికి బాహుబలి-2 సినిమా 400 కోట్ల రూపాయల క్లబ్ లోకి ఎంటర్ కానుంది. ఇప్పటివరకు ఇండియాలో ఏ సినిమా 4వందల కోట్ల షేర్ సాధించలేదు. తొలిసారిగా ఈ క్లబ్ ను క్రియేట్ చేసిన ఘనత బాహుబలి-2కు దక్కుతుంది.