నైజాం హక్కులతో భారీ బడ్జెట్ సినిమా తీయొచ్చు..

Tuesday,October 11,2016 - 03:45 by Z_CLU

రిలీజ్ కు ముందే బాహుబలి సినిమా రికార్డుల మీద రికార్డులు సృష్టిస్తోంది. ఇప్పటికే ఈ సినిమా తమిళ డిస్ట్రిబ్యూషన్ హక్కులు రికార్డు ధరకు అమ్ముడుపోగా… ఓవర్సీస్ రైట్స్ లో ఇది ఇప్పటికే బెంచ్ మార్క్ సెట్ చేసింది. ఇప్పుడు నైజాంలో కూడా బాహుబలి సినిమా సరికొత్త రికార్డు సృష్టించింది. ఏకంగా 45 కోట్ల నుంచి 50కోట్ల రూపాయల మధ్య ఈ సినిమా నైజాం హక్కులు అమ్ముడుపోయాయని తెలుస్తోంది. భారీ కాంపిటిషన్ మధ్య ఏషియన్ ఫిలిమ్స్ అధినేత సునీల్ నారంగ్… బాహుబలి-2 రైట్స్ దక్కించుకున్నట్టు టాక్.
baahubali2
బాహుబలి మొదటి భాగాన్ని నైజాంలో దిల్ రాజు డిస్ట్రిబ్యూట్ చేశారు. కళ్లుచెదిరే లాభాలు కూడా అందుకున్నారు. రెండో భాగం కూడా దిల్ రాజు, అల్లు అరవింద్ లాంటి నిర్మాతలు పోటీపడ్డారు. కానీ కళ్లుచెదిరే ఎమౌంట్ తో ఏషియన్ సునీల్… పార్ట్-2 రైట్స్ దక్కించుకున్నారు. తొలి భాగం నైజాంలో 43కోట్ల రూపాయల షేర్ సాధించింది. ఇప్పుడు రెండో భాగం దాదాపు 60 కోట్లు షేర్ సాధిస్తుందనే బెట్టింగ్ నడుస్తోంది. తెలుగులో ఇప్పటివరకు ఏ సినిమా నైజాంలో ఇంత భారీ మొత్తానికి అమ్ముడుపోలేదు.