బాహుబలి-2.. 1050 తెరలపై 50 రోజులు

Friday,June 16,2017 - 10:21 by Z_CLU

రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన బాహుబలి-ది కంక్లూజన్ సినిమా రికార్డుల హోరు కొనసాగుతూనే ఉంది. ఇవాళ్టితో ఈ సినిమా 50 రోజులు పూర్తిచేసుకుంది. ఏప్రిల్ 28న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా విడుదలైన ఈ సినిమా.. 50-డేస్ లో కూడా సరికొత్త రికార్డు సృష్టించింది. దేశంలో 1050 స్క్రీన్స్ పై దిగ్విజయంగా 50 రోజులు పూర్తిచేసుకుంది బాహుబలి-2.

తెలుగు రాష్ట్రాల్లో ప్రస్తుతం 282 స్క్రీన్స్ పై బాహుబలి-2 రన్ అవుతోంది. తమిళనాట 120, కేరళ 102, కేరళలో 58 థియేటర్లలో 50 రోజులు పూర్తిచేసుకుంది బాహుబలి-2. బాలీవుడ్ లో ఇప్పటికే నంబర్ వన్ మూవీగా నిలిచిన ఈ సినిమా… టాలీవుడ్, మల్లూవుడ్ లో కూడా నంబర్ వన్ గా అవతరించింది.

ప్రస్తుతం ఈ సినిమా ప్రపంచవ్యాప్త వసూళ్లు 1700 కోట్లకు అటుఇటుగా ఉన్నాయి. త్వరలోనే ఈ సినిమాను చైనాతో పాటు మరికొన్ని దేశాల్లో విడుదల చేయబోతున్నారు. అక్కడ కూడా హిట్ అయితే బాహుబలి-2 సినిమా 2వేల కోట్ల క్లబ్ లోకి చేరుతుంది.