బాలీవుడ్ లో 'బాహుబలి-2' రికార్డ్ కలెక్షన్స్ ...

Wednesday,May 03,2017 - 01:00 by Z_CLU

వరల్డ్ వైడ్ గా  ఈ నెల 28న రిలీజ్ అయిన ‘బాహుబలి-2’ అన్ని పరిశ్రమల్లో రికార్డు  కలెక్షన్ వసూళ్లు చేస్తూ దూసుకెళ్తుంది.. ముఖ్యంగా బాలీవుడ్ బాక్సాఫీస్ దగ్గర కూడా ‘బాహుబలి-2’ తెలుగు సినిమా సత్తా చాటి భారీ కలెక్షన్స్ తో సునామి సృష్టిస్తోంది…

బాలీవుడ్ లో ప్రముఖ నిర్మాత కరణ్ జోహాన్ ఈ సినిమాను రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే. రిలీజ్ కి ముందే కరణ్ జోహార్ ప్రమోషన్స్ తో ఈ సినిమా పై భారీ హైప్ క్రియేట్ చేయడం రిలీజ్ తర్వాత రాజమౌళి టేకింగ్, విజువల్స్ బాలీవుడ్ ఆడియన్స్ ను బాగా ఎట్రాక్ట్ చేయడంతో బాహుబలి రికార్డ్ కలెక్షన్స్ తో అందుకుంటూ తెలుగు సినిమా స్టామినా చూపిస్తుంది ..

ఇక ఓపెనింగ్ రోజు 41 కోట్లు కొల్లగొట్టిన ఈ సినిమా శని, ఆది, సోమ వారాల్లో వరుసగా 40 కోట్లకు పైగానే వసూళ్లు చేసిందని సమాచారం.. మంగళ వారం కూడా అదే జోరును కంటిన్యూ చేస్తూ ఈ సినిమా 30 కోట్ల కలెక్షన్స్ అందుకుందట.. మొత్తం 5 రోజుల కు కలిపి ‘బాహుబలి-2 ‘ 190 కోట్లు దాటిందని ఈరోజు కలెక్షన్స్ తో కలిపి 200 కోట్లు దాటేయనుందని ట్రేడ్ వర్గాల సమాచారం.. సో ఈ లెక్కన్న చూస్తే బాహుబలి-2 బాలీవుడ్ లో కూడా భారీ వసూళ్లతో సరికొత్త రికార్డ్ నెలకొల్పుతుందనడంలో ఎటువంటి సందేహం లేదు…