బాహుబలి 2 చైనీస్ వర్షన్ అప్ డేట్స్

Friday,May 26,2017 - 12:32 by Z_CLU

బాహుబలి 2 సక్సెస్ ఫుల్ గా ఫిఫ్త్ వీక్ లోకి ఎంటరయింది. భారీ అంచనాల మధ్య రిలీజైన ఈ బిగ్గెస్ట్ మ్యాగ్నం ఓపస్, ఎక్స్ పెక్టేషన్స్ ని రీచ్ అవ్వడమే కాదు, ఫ్యూచర్ సినిమాలకు సరికొత్త ఇన్స్ పిరేషన్ లా నిలిచింది. 2000 కోట్ల వసూళ్ళ వైపు పరుగులు పెడుతున్న బాహుబలి 2 రిపీటెడ్ ఆడియెన్స్ తో అదే క్రేజ్ తో ప్రదర్శించబడుతుంది.

నేటివిటీతో సంబంధం లేకుండా తెరకెక్కి హాలీవుడ్ ట్రేడ్ వర్గాలను కూడా షేక్ చేసేసిన బాహుబలి వారానికో రికార్డు చొప్పున బ్రేక్ చేస్తూనే ఉంది. జస్ట్ ఇండియాలో 1000 కోట్లు నెట్ వసూలు చేసి బ్యాగ్ లో వేసుకున్న బాహుబలి 2 సినిమా యూనిట్, ఇక ఈ విజువల్ వండర్ ని చైనా రిలీజ్ కి సిద్ధం చేస్తుంది. ఈ రిలీజ్ కి సంబంధించి ఇంకా డీటేల్స్ అయితే అఫీషియల్ గా అనౌన్స్ కాలేదు కానీ సినిమా యూనిట్ ఆల్ రెడీ చైనీస్ వర్షన్ పోస్ట్ ప్రొడక్షన్ తో పాటు, సినిమా ప్రమోషన్స్ కూడా పకడ్బందీగా ప్లాన్ చేస్తునట్టు తెలుస్తుంది.