తెలుగు రాష్ట్రాల్లో 'బాహుబలి-2' 6 రోజుల షేర్

Thursday,May 04,2017 - 01:23 by Z_CLU

రెండేళ్ల ఎదురుచూపులతో భారీ అంచనాల నడుమ గ్రాండ్ గా రిలీజ్ అయిన ‘బాహుబలి-2’ ప్రస్తుతం అన్ని ఏరియాల్లో హౌస్ ఫుల్ కలెక్షన్స్ తో సరికొత్త రికార్డులను నెలకొల్పుతుంది… ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా అన్ని రికార్డులను బ్రేక్ చేస్తూ 5 రోజుల్లోనే 100 కోట్ల మార్క్ ను అవలీలగా దాటేసింది..

రిలీజ్ అయి 6 రోజులవుతున్నప్పటికీ ఈ సినిమా క్రేజ్ ఏ మాత్రం తగ్గకుండా అదే రేంజ్ లో తెలుగు రాష్ట్రాల్లో భారీ వసూళ్లు రాబడుతూ టాలీవుడ్ బాక్సాఫీస్ దగ్గర భారీ కలెక్షన్స్ కొల్లగొడుతుంది..

 

తెలుగు రాష్ట్రాల్లో 6 రోజుల ‘బాహుబలి-2’ షేర్

నైజాం : రూ 32.40 కోట్లు
సీడెడ్ : రూ 19.15 కోట్లు
ఉత్తరాంధ్ర : రూ 14.05 కోట్లు
వెస్ట్ : రూ 9.01 కోట్లు
ఈస్ట్ : రూ 11.45 కోట్లు
గుంటూరు : రూ 11.45 కోట్లు
కృష్ణ : రూ 7.87 కోట్లు
నెల్లూరు : రూ 4.33 కోట్లు

తెలుగు రాష్ట్రాల్లో మొత్తం షేర్ – 109.70