B.V.S. రవి ఇంటర్వ్యూ...

Monday,November 27,2017 - 01:23 by Z_CLU

సాయి ధరమ్ తేజ్ ‘జవాన్’ డిసెంబర్  1 న  గ్రాండ్ గా రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూ లో ఈ మూవీ మేకింగ్ ప్రాసెస్ తో పాటు, సినిమాలోని ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్స్ ని షేర్ చేసుకున్నాడు ఈ మూవీ డైరెక్టర్. అ ఇంట్రెస్టింగ్ చిట్ చాట్ మీకోసం…

జవాన్ సినిమా గురించి…

జవాన్ సినిమా గురించి ఆల్ రెడీ ట్రైలర్ లో చెప్పేశాం. DRDO (Defense Research Develepment  Organisation) గురించి అందరికీ తెలియాలి. మన దేశాన్ని కాపాడుకోవడానికి ఈ సంస్థ ఎలా పని చేస్తుందనేది ఈ సినిమా ద్వారా తెలుస్తుంది.

హైలెట్స్ మాత్రం అవే….

సినిమాలో మెయిన్ ఎలిమెంట్ ని ఎక్కడా రివీల్ చేయలేదు. దాంతో పాటు సెకండాఫ్ లో ఉండే థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ సినిమాలో హైలెట్ గా నిలుస్తాయి.

 

ఆక్టోపస్ మిసైల్ చుట్టూ కథ…

ఈ సినిమాలో సాయి ధరమ్ తేజ్ RSS జవాన్ గా కనిపిస్తాడు. ఒక కొత్త బ్యాక్ డ్రాప్ లో మిడిల్ క్లాస్ నుండి వచ్చిన యువకుడు తన దేశాన్ని కాపాడుకోవడం కోసం ఏం చేశాడు..? అసలీ ఆక్టోపస్ మిసైల్ ఏంటి..? దాని కోసం హీరో ఏం చేశాడు అనేది మెయిన్ సినిమా… ఫ్యామిలీనా..? దేశమా..? అనే సంఘర్షణలో హీరో దేన్నీ ఎంచుకుంటాడు..? అనేదే జవాన్ లో ప్రధానాంశం….

సాయిధరం తేజ్ కరియర్ లో ఫస్ట్ టైమ్…

సాయి ధరం తేజ్ ఇప్పటివరకు చాలా జోవియల్ గా ఉండే క్యారెక్టర్స్ చేశాడు. యాక్షన్ సీక్వెన్సెస్ లో నటించడం వేరు, సినిమా మొత్తంలో బ్యాలన్స్డ్ గా ఒకే రకమైన ఇమోషన్ ని భుజాలపై పెట్టుకుని ట్రావెల్ చేయడం వేరు.. ఒకరకంగా ఈ సినిమా సాయి ధరం తేజ్ పెద్ద బాధ్యత అనే చెప్పాలి….

ప్రసన్న దొరకడం అదృష్టం…

ఈ సినిమాలో విలన్ గా ప్రసన్న పర్ఫామెన్స్ హైలెట్ గా ఉంటుంది. ఎంత డెడికేటెడ్ గా పని చేస్తాడంటే సెట్ పైకి రాకముందే ప్రతి డైలాగ్ ని బట్టిపట్టి, పర్ఫామెన్స్ విషయంలో కూడా అప్పటికే ప్రాక్టీస్ చేసి వచ్చేవాడు. అంత డెడికేటెడ్ ఆర్టిస్ట్ మన ఇండస్ట్రీకి దొరకడం నిజంగా అదృష్టం…

మెహ్రీన్ క్యారెక్టర్…

మెహ్రీన్ ఈ సినిమాలో భార్గవి అనే క్యారెక్టర్ లో కనిపిస్తుంది. పెయింటింగ్ చేస్తుంటుంది. ఇప్పటివరకు ట్రెడిషనల్ గా కనిపించిన మెహ్రీన్ ఈ సినిమాలో చాలా మాడ్రన్ గా కనిపిస్తుంది. మెచ్యూర్డ్ గా పర్ఫామ్ చేసింది.

 

ఈ సినిమా  సక్సెస్ కావాలి…

నా కరియర్ కే కాదు, ఈ సినిమా నా కుటుంబానికి కూడా చాలా క్రూషల్. ఒక రకంగా చెప్పాలంటే నా కుటుంబానికి ఈ సినిమా కుటుంబానికి అన్నం, పప్పు లాంటిది. ఈ సినిమా సక్సెస్ అయితేనే నాకు నెక్స్ట్ అవకాశాలు వస్తాయి. లైఫ్ ఉంటుంది. అందుకే చాలా బాధ్యతతో చేశానీ సినిమాని.

తమన్ ప్రాణం పోశాడు…

ఈ సినిమాకి తమన్ సోల్ అనే చెప్పాలి. తన మ్యూజిక్ తో బ్యాక్ గ్రౌండ్ స్కోర్ తో సినిమాకి ప్రాణం పోశాడు.