బాలీవుడ్ విజయ్ దేవరకొండ

Tuesday,September 17,2019 - 02:03 by Z_CLU

‘కబీర్ సింగ్’ సక్సెస్ తరవాత విజయ్ దేవరకొండ సినిమాలకు బాలీవుడ్ లో క్రేజ్ పెరిగిపోయింది. అందుకే రీసెంట్ గా ‘డియర్ కామ్రేడ్’ సినిమా రిలీజ్ కూడా కాకముందే కరణ్ జోహార్ ఆ సినిమా హిందీ రైట్స్ ని దక్కించుకున్నాడు. అయితే బాలీవుడ్ లో విజయ్ దేవరకొండకి క్రేజ్ ఉన్నట్టు, టాలీవుడ్ లో ఆయుష్మాన్ ఖురానా కి అదే స్థాయిలో క్రేజ్ క్రియేట్ అవుతుంది.

ప్రస్తుతం టాలీవుడ్ స్టార్ హీరోల దృష్టి ఆయుష్మాన్ సినిమాలపై పడింది. నితిన్ చేయబోతున్న హిందీ రీమేక్ ‘అంధాధున్’, ఈ హీరోదే. అంతెందుకు నాగచైతన్య చేయబోతున్న రీమేక్ ‘బధాయి హో’ కూడా ఆయుష్మాన్ దే.

గతంలో ‘విక్కీ డోనర్’ సినిమాని ‘నరుడా డోనరుడా’ అనే టైటిల్ తో సుమంత్ రీమేక్ చేసిన విషయం తెలిసిందే. ఈ సినిమా తర్వాత ఇమ్మీడియట్ గా ఈ హీరో మిగతా సినిమాలు టాలీవుడ్ ఫోకస్ లోకి రాకపోయినా డిఫెరెంట్ కథలను ఎంచుకుంటూ, మినిమం సక్సెస్ గ్యారంటీ అనిపించుకుంటున్న ఈ హీరో సినిమాలు ఇప్పుడు వరసగా టాలీవుడ్ లో డిమాండ్ లోకి వస్తున్నాయి.

నితిన్, నాగచైతన్య లు చేయబోతున్న ఈ సినిమాలు సక్సెస్ అందుకుంటే, ఆయుష్మాన్ ఖురానా ఫ్యూచర్ సినిమాలకు తెలుగులో మరింత డిమాండ్ పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. విజయ్ దేవరకొండ సినిమాలకు బాలీవుడ్ లో డిమాండ్ ఉన్నట్టు, ఇక్కడ డిమాండ్ లో ఉన్నాడు ఆయుష్మాన్ ఖురానా.