మరో సినిమాతో రెడీ అయిన అ! డైరెక్టర్

Thursday,April 26,2018 - 04:08 by Z_CLU

రీసెంట్ గా డిఫెరెంట్ ఎంటర్ టైనర్ అ! తో ఇంప్రెస్ చేసిన దర్శకుడు ప్రశాంత్ తన నెక్స్ట్ సినిమాతో రెడీ అవుతున్నాడు. జస్ట్ ఒక్క సినిమాతోనే ఫోకస్ లోకి వచ్చిన ఈ ఫిల్మ్ మేకర్ ఇప్పుడు తన నెక్స్ట్ సినిమా ప్రిపరేషన్స్ లో ఉన్నాడు.

రీసెంట్ గా ‘గరుడవేగ’ సినిమాతో సూపర్ హిట్ అందుకున్న డా.రాజశేఖర్ తో ప్రశాంత్ తన నెక్స్ట్ సినిమా ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తుంది.  ఈ సినిమా గురించి అఫీషియల్ కన్ఫర్మేషన్ అయితే రాలేదు కానీ, మ్యాగ్జిమం జూలై లో ఈ సినిమా సెట్స్ పైకి రానుందనే టాక్ కాస్త గట్టిగానే వినిపిస్తుంది. ఈ సినిమాకి ‘కల్కి’ అని టైటిల్ ఫిక్స్ చేసుకున్నాడు ప్రశాంత్.

రెగ్యులర్ సినిమాల్లా కాకుండా డిఫెరెంట్ ఎంటర్ టైనర్స్ తోకరియర్ ప్లాన్ చేసుకుంటున్న ప్రశాంత్ సినిమాపై అప్పుడే టాలీవుడ్ లో డిస్కషన్స్ బిగిన్ అయ్యాయి. ఈ సినిమాకి సంబంధించి మరిన్ని డీటేల్స్ తెలియాల్సి ఉంది.