జీ ఎక్స్ క్లూజివ్: రాజుగారి గది-3 హీరోయిన్ ఫిక్స్

Monday,July 15,2019 - 12:38 by Z_CLU

తమన్న లీడ్ రోల్ లో ఈ సినిమా లాంఛ్ అయింది. ఆమె తప్పుకోవడంతో కాజల్ ను కలిశారు. ఆమె ఒప్పుకోకపోవడంతో తాప్సిని మీట్ అయ్యారు. అది కూడా వర్కవుట్ కాకపోవడంతో అవికా గౌర్ ను తీసుకున్నారు.

అవును.. రాజుగారి గది-3 హీరోయిన్ ఫిక్స్ అయింది. అవికా గౌర్ ను ఈ సినిమాలో లీడ్ రోల్ కోసం తీసుకున్నారు. ఉయ్యాల జంపాల సినిమాతో హీరోయిన్ గా పరిచయమైన ఈ బ్యూటీ.. ఈమధ్య కాస్త గ్యాప్ తీసుకుంది. ఇప్పుడు రాజుగారి గది-3తో మళ్లీ సిల్వర్ స్క్రీన్ పైకి వస్తోంది.

సినిమా చూపిస్త మామ, లక్ష్మీరావె మా ఇంటికి, ఎక్కడికి పోతావ్ చిన్నవాడా సినిమాలతో అవికా గౌర్ క్రేజ్ తెచ్చుకుంది. అయితే ఎక్కడికి పోతావ్ చిన్నవాడా తర్వాత ఆమె కెరీర్ లో గ్యాప్ వచ్చింది. ఆ గ్యాప్ లో హిందీ టెలివిజన్ ఫీల్డ్ లో ఆమె బిజీ అయింది. మళ్లీ ఇన్నాళ్లకు ఓంకార్ దర్శకత్వంలో రాబోతున్న రాజుగారి గది-3తో తెలుగుతెరపైకి వస్తోంది అవిక.